CSK Vs GT IPL 2023 Final: ఫైనల్ మ్యాచ్ టెన్షన్లో 2423 కండోమ్స్ ఆర్డర్.. స్విగ్గీ బోల్డ్ స్టేట్మెంట్
Swiggy Sells 2423 Condoms: చెన్నై, గుజరాత్ జట్ల మధ్య ఫైనల్‌కు వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ జరుగుతుందో లేదో అని అభిమానులు టెన్షన్ పడ్డారు. మరికొందరు ఈ సమయంలో భారీగా కండోమ్‌లు ఆర్డర్ చేసి తెప్పించుకోవడం విశేషం. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 2423 కండోమ్‌లు డెలివరీ చేసినట్లు తెలిపింది.
Swiggy Sells 2423 Condoms: ఈ ఏడాది ఐపీఎల్ వినోదంలో క్రికెట్ అభిమానులు తడిసిముదయ్యారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ అసలుసిసలు మజాను అందించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గుజరాత్‌పై విజయం సాధించి.. ఐదోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు రికార్డుస్థాయిలో వ్యూస్ వచ్చినట్లే.. ప్రముఖ డెలివరీ యాప్ స్విగ్గీ కూడా భారీస్థాయిలో ఆర్డర్లు వచ్చాయి. బిర్యానీలతోపాటు కండోమ్‌లు కూడా ఎక్కువగా డెలివరీ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆర్డర్లకు సంబంధించి వివరాలను వెల్లడించింది.
ఆదివారం చెన్నై, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఆదివారం నుంచి సోమవారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే. మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందోనని అందరూ టెన్షన్ పడుతుంటే.. స్విగ్గీ మాత్రం ఆసక్తికరమైన విషయ పంచుకుంది. స్విగ్గీ ఇన్‌స్టా మార్డ్ ద్వారా 2423 కండోమ్‌లు డెలివరీ చేశామంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. అంతేకాదు అదిరిపోయే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ రోజు రాత్రికి 22 మంది కంటే ఎక్కువ ఆటగాళ్లు ఆడబోతున్నారంటూ బోల్డ్‌గా రాసుకొచ్చింది.
ఈ ట్వీట్‌కు ఊహించని రీతిలో నెటిజన్ల నుంచి రిప్లైలు వచ్చాయి. స్విగ్గీ సృజనాత్మకతను మెచ్చురకుంటున్నారు. ఎంత మంది ఆటగాళ్లు ఆడినా.. కనీసం వారు సురక్షితంగా ఆడుతున్నారంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ లెక్కలు చూసి సింగిల్స్ ఓ మూలన కూర్చొని ఏడుస్తున్నారంటూ మరో నెటిజన్ అన్నాడు. అసలు వాళ్లలో సగం మంది ఆటగాళ్లు ఆడడం లేదని.. కానీ చాలామంది ఆడుతున్నట్లు నటిస్తున్నారని మరో యూజర్ అన్నాడు. మీకు అర్థం కాకుంటే.. మళ్లీ చదవాలని సూచించాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఐపీఎల్ సీజన్‌లో అత్యధికంగా బిర్యానీ ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ వెల్లడించింది. ఈ సీజన్ మొత్తంలో 1.2 కోట్ల ఆర్డర్‌లను అందుకునట్లు పేర్కొంది. అంటే ప్రతి నిమిషానికి సగటున 212 మంది బిర్యానీ ఆర్డర్లు ఇచ్చారని తెలిపింది. ఎక్కువగానాన్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసినట్లు చెప్పింది. తమ స్విగ్గీ డెలివరీ బాయ్స్ 330 మిలియన్ కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేశారని.. బ్యాట్స్‌మెన్లు వేగంగా పరుగులు చేసినట్లే.. తమ సిబ్బంది కూడా వేగంగా పనిచేశారని అభినందించింది. అత్యంత వేగవంతమైన డెలివరీ కేవలం 77 సెకన్లలో అందజేసి కోల్‌కతాలో రికార్డు సృష్టించినట్లు తెలిపింది. ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారుడు ఏకంగా 701 సమోసాలను ఈ సీజన్‌లోనే ఆర్డర్ చేయడం విశేషం. మరో వినియోగదారుడు ఏకంగా రూ.26,474 విలువైన ఫుడ్‌ను స్విగ్గీ నుంచి ఆర్డర్ చేశాడు. ఈ సీజన్‌లో అతిపెద్ద సింగిల్ ఆర్డర్ ఇదేనని స్విగ్గీ తెలిపింది.
Also Read: Bandi Sanjay: A నుంచి Z వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇవే.. బండి సంజయ్ కౌంటర్
Also Read: Google New Rules: లోన్ యాప్‌లపై గూగుల్ కఠిన చర్యలు.. కొత్త నిబంధనలు ఇలా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , FacebooKమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి