Washington Sundar IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2023 మొత్తానికి స్టార్ ఆటగాడు దూరం!
Sunrisers Hyderabad All-Rounder Washington Sundar Out From IPL 2023. సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ 2023 మొత్తానికి దూరం అయ్యాడు.
SRH All-Rounder Washington Sundar Ruled Out Of IPL 2023 with Hamstring Injury: ఐపీఎల్ 2023లో వరుస ఓటుములను ఎదుర్కొంటున్న తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మిగిలిన టోర్నీ మొత్తానికి దూరం అయ్యాడు. మోకాలి గాయం కారణంగా సుందర్ ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సుందర్ తొడ కండరాల గాయంతో భాదపడుతున్నాడని, ఈ సీజన్ మొత్తానికి అతడు దూరమయ్యాడని పేర్కొంది.
'మోకాలి గాయంతో ఐపీఎల్-2023 సీజన్ నుంచి వాషింగ్టన్ సుందర్ తప్పుకున్నాడు. సుందర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము' అని సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విటర్‌లో పేర్కొంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సుందర్ అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన సుందర్.. బ్యాటింగ్‌లో 24 పరుగులు చేశాడు. అయితే అతనికి అండగా మారే ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్స్ రాణించకపోవడంతో హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.
ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు, 60 పరుగులు చేశాడు. తొలి ఆరు మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన సుందర్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో అద్భుతమైన ప్రదర్శన చేసి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. అంతలోనే గాయం బారిన పడి టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. సుందర్ మెగా టోర్నీకి దూరం కావడం ఎస్‌ఆర్‌హెచ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే సరైన లోయరార్డర్ బ్యాటింగ్ లేక ఇబ్బంది పడుతున్న హైదరాబాద్‌కు సుందర్ కూడా దూరమయ్యాడు.
ఇప్పటివరకు వాషింగ్టన్ సుందర్ రిప్లేస్‌మెంట్ ఆటగాడి పేరును సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటించలేదు. సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ .8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్.. కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో హైదరాబాద్ నిలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 6 గెలవాలి. అదే సమయంలో రన్ రేట్ కూడా మెరుగ్గా ఉండాలి. ప్రస్తుత ఫామ్ చూస్తే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీసం 5 మ్యాచులు కూడా గెలిచే పరిస్థితి లేదు. ఓ మ్యాచులో పేలవ బౌలింగ్, మరో మ్యాచులో దారుణ బ్యాటింగ్ కారణంగా సన్‌రైజర్స్ వరుస ఓటములను ఎదుర్కొంటోంది. కెప్టెన్సీ మారినా సన్‌రైజర్స్ రాత మాత్రం మారడం లేదు.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.