Why David Warner Was Given Not Out..?: ఐపిఎల్ 2023 టోర్నీలో భాగంగా గౌహతిలోని బార్సాపరా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్థాన్ రాయల్స్ 12వ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కేప్టెన్ డేవిడ్ వార్నర్‌ తన వ్యక్తిగత స్కోర్ 61 పరుగుల వద్ద ఉండగా లైఫ్‌లైన్ అందుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఎక్స్‌ట్రా కవర్‌లో చాలా క్లియర్ క్యాచ్ గా పట్టాడు. అయినప్పటికీ అంపైర్ మాత్రం యశస్వి జైశ్వాల్ పట్టుకున్న క్యాచ్ ని పరిగణనలోకి తీసుకోకుండా నాటౌట్ గా ప్రకటించాడు. తొలుత దీనికి కారణం ఏంటో తెలియక చాలామంది బుర్ర గోక్కుకున్నారు. అసలు విషయం ఏంటో అంపైర్ చెప్పాకా.. ఓహో ఇలాంటి రూల్ కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ డేవిడ్ వార్నర్ కి లైఫ్ లైన్ ఇచ్చిన ఆ రూల్ ఏంటి ?
T20 క్రికెట్ రూల్స్ ప్రకారం, పవర్‌ప్లే తరువాత.. అంటే ఇన్నింగ్స్‌ ప్రారంభించాకా మొదటి ఆరు ఓవర్ల తర్వాత 30 గజాల సర్కిల్ బయట గరిష్టంగా ఐదుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు.  అయితే, ఇక్కడ డేవిడ్ వార్నర్ నాటౌట్ అని అంపైర్ చెప్పడానికి కారణం ఏంటంటే.. బౌలర్ మురుగన్ అశ్విన్ బౌలింగ్ చేసే సమయంలో బంతి అతడి చేతి నుంచి విడుదలయ్యే సమయానికి యశస్వి జైస్వాల్ 30 గజాల సర్కిల్ బయటే ఉన్నాడు. అంటే, బౌలర్ బంతిని విసిరే సమయానికి యశస్వి జైస్వాల్ సర్కిల్ బయట ఉన్న ఆరో ఫీల్డర్ కావడం వల్లే తాను నిబంధనల ప్రకారం ఈ బంతిని నో బాల్‌గా పరిగణించడంతో పాటు అతడి క్యాచ్ ని పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రకటించాడు.


ఇదిలావుంటే, వాస్తవానికి మురుగన్ అశ్విన్ బాల్ ని డెలివరి చేసినప్పుడు యశస్వి జైస్వాల్ ఆ 30 గజాల సర్కిల్ లోపలే నిలబడి ఉండి, డేవిడ్ కొట్టిన షాట్‌ని క్యాచ్ పట్టడం కోసమే ఆ సర్కిల్ దాటి ముందుకు పరిగెత్తి ఉంటే డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యేవాడే. ఒకరకంగా డేవిడ్ వార్నర్ కి ఈ లైఫ్ లైన్ దొరికినప్పటికీ.. అతడు దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడనే అనుకోవాలి. ఎందుకంటే ఆ తరువాత మరో నాలుగు పరుగులకే.. అంటే 65 పరుగులు (55 బంతుల్లో) వద్ద యుజ్వేంద్ర చాహల్ చేతిలో డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. 



ఇది కూడా చదవండి : Fastest 50 in IPL 2023: ఐపిఎల్ 2023లో ఫాస్టెస్ట్ 50 రికార్డ్ అజింక్య రహానేదే.. ఎన్ని బంతుల్లోనో తెలుసా ?


ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒకరకంగా డేవిడ్ వార్నర్ ఔట్ ని నాటౌట్ గా చెప్పడం వల్ల టీ20 మ్యాచ్ రూల్స్ గురించి అంపైర్ మరోసారి గుర్తుచేసినట్టయింది. లేదంటే ఈ నిబంధన గురించి చాలా మందికి తెలిసి ఉండేదే కాదు. పైగా ఇలాంటి అవకాశాలు ప్రత్యర్థి జట్టుకు లైఫ్ లైన్ ఇచ్చినట్టే అవుతుంది కనుక ఆటగాళ్లు అందరూ ఇకపై ఈ విషయాన్ని గుర్తుంచుకుని నడుచుకుంటారు అనే అనుకోవచ్చు. ఐపిఎల్ 2023 టోర్నీలో ఇది ఒక చెప్పుకోదగిన మూమెంట్ అనే భావించవచ్చు.


ఇది కూడా చదవండి : Sanju Samson Stunning Catch: సింగిల్ హ్యాండ్‌తో సంజూ శాంసన్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook