Ireland vs India 2nd T20: పసికూన ఐర్లాండ్ భారత్‌పై గట్టిగానే ప్రతిఘటించింది. మొదటి టీ20లో ఐర్లాండ్‌పై సునాయాసంగా గెలిచిన టీమిండియాకు రెండో టీ20లో మాత్రం ఐర్లాండ్ గట్టి ఫైట్ ఇచ్చింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం కోసం భారత్ చివరి బంతి వరకు టెన్షన్ పడక తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసి.. విజయానికి 5 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఐర్లాండ్ ఈ మ్యాచ్‌లో ఓడినా ఆ జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉందనే చెప్పాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో దీపక్ హుడా 6 సిక్సులు, 9 ఫోర్లతో 57 బంతుల్లోనే 104 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సంజు శాంసన్ 9 ఫోర్లు, 4 సిక్సులతో 77 (42) పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 3 వికెట్లు, జోషువా లిటిల్, క్రెయిగ్ యంగ్ రెండేసి వికెట్లు తీశారు.


226 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఐర్లాండ్‌కి ఓపెనర్లు పాల్ స్టిర్లింగ్ (40), ఆండ్రూ (60) మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఆండ్రూ 37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులతో 60 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హ్యారీ టెక్టర్ (39), జార్జ్ డాక్‌రెల్ (34)పరుగులతో రాణించారు. ఉమ్రాన్ మాలిక్ వేసిన చివరి ఓవర్‌లో ఐర్లాండ్ విజయానికి 6 బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. 


మొదటి బాల్ పరుగులేమీ రాలేదు. ఆ తర్వాతి బంతి నో బాల్. ఆ తర్వాత వరుసగా రెండు బంతుల్లో మార్క్ అడైర్ రెండు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత చివరి 3 బంతులు సింగిల్స్‌కే పరిమితమవడంతో ఐర్లాండ్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి బంతికి సిక్స్ బాది ఉంటే ఐర్లాండ్ విజయం సాధించేది. దీంతో చివరి బంతి వరకు మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఈ విజయంతో రెండు టీ20ల సిరీస్‌ను టీమిండియా గెలుచుకుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగ్‌లో అదరగొట్టిన దీపక్ హుడాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ లభించింది.




Also Read: Udaipur  Beheaded Case: ఐదు రోజుల క్రితమే రక్షణ కోరిన టైలర్.. పట్టించుకోని పోలీసులు! ఉదయపూర్ హత్య కేసులో సంచలనం..  


Also Read: Udaipur Killing: ఇండియాలోనూ హిందువులకు రక్షణ లేదు.. ఉదయ్‌పూర్ దర్జీ హత్యపై రచయిత్రి తస్లీమా నస్రీన్ రియాక్షన్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి