Ishan Kishan replaces KL Rahul in WTC Final 2023 : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ 2023కు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్‌ రాహుల్‌ గాయంతో దూరమయిన విషయం తెలిసిందే. రాహుల్‌ స్థానంలో యువ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌కు చోటు లభించింది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. ఇషాన్ ప్రస్తుతం ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తరఫున పరుగులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగా ఫైట్ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం బీసీసీఐ ముగ్గురు స్టాండ్‌బై ఆటగాళ్లను కూడా ఎంపిక చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ గెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ గాయపడ్డాడు. బౌండరీ వద్ద బంతిని ఆపబోయే సమయంలో రాహుల్ తొడ కండ‌రాలు పట్టేషాయి. దాంతో నొప్పితో రాహుల్ మైదానంలోనే కూలిపోయాడు. ఆ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేయ‌ని రాహుల్.. ఆపై బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో చివ‌ర‌లో వ‌చ్చిన ఒక్క రన్ కూడా చేయ‌లేక‌పోయాడు. స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాక సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. కుడి తొడ పైభాగంలో సర్జరీ చేయించుకునేందుకు రాహుల్ నిశ్చయించుకున్నాడు. దాంతో ఐపీఎల్ 2023, డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 నుంచి తపుకున్నాడు. 


కేఎల్ రాహుల్‌ గాయం నేపథ్యంలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ 2023 భారత జట్టులో యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌కు (Ishan Kishan WTC Final 2023) బీసీసీఐ చోటు ఇచ్చింది. ఇంతవరకు భారత్ తరఫున ఒక్క టెస్టు కూడా ఆడని ఇషాన్‌.. ఏకంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. మరోవైపు స్వల్ప గాయాలైన పేసర్లు ఉమేశ్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. భారత్‌, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ వచ్చే నెల 7న లండన్‌లోని ఓవల్‌లో మొదలుకానుంది. స్టాండ్‌బై ప్లేయర్లుగా రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ముకేశ్‌ కుమార్‌ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు.



డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టు (India Letest Squad for WTC Final):
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌).
స్టాండ్‌ బై ప్లేయర్లు: రుతురాజ్‌ గైక్వాడ్‌, ముకేశ్‌ కుమార్‌, సూర్యకుమార్‌ యాదవ్‌.


Also Read: 2023 Hyundai Exter Bookings: హ్యుందాయ్ నుంచి మరో ఎస్‌యూవీ.. బుకింగ్స్ మొదలు! ఇక టాటా పంచ్‌ను మర్చిపోవాల్సిందే  


Also Read: Hyundai Creta Price 2023: కేవలం 2 లక్షలకే కొత్త హ్యుందాయ్ క్రెటాను ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.