Virat Kohli - Brett Lee: అది పూర్తిగా విరాట్ కోహ్లీ నిర్ణయమే.. కాలమే సమాధానం చెపుతుంది: బ్రెట్ లీ
Brett Lee on Virat Kohli`s Test Captaincy. కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినప్పటినుంచి విరాట్ కోహ్లీ నిర్ణయంపై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ తన అభిప్రాయం తెలిపారు.
Brett Lee on Virat Kohli's Test Captaincy: గత ఏడాది టీ20 ప్రపంచకప్ 2021 అనంతరం టీ20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీ ( Virat Kohli).. మెగా టోర్నీకి ముందే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు డిసెంబరులో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తప్పించింది. ఇక 2022 జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కెప్టెన్సీ (Virat Kohli's Test Captaincy)కీ కూడా గుడ్ బై చెప్పాడు. దాంతో కోహ్లీ ఇప్పుడు కేవలం బ్యాటర్‌గా మాత్రమే కొనసాగుతున్నాడు.
కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినప్పటినుంచి విరాట్ కోహ్లీ నిర్ణయంపై పలువురు స్పందిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ (Brett Lee) తన అభిప్రాయం తెలిపారు. 'విరాట్ కోహ్లీ నిర్ణయంపై నేను పెద్దగా మాట్లాడలేను. ఏదేమైనా అది అతడి నిర్ణయం. టీమిండియాను టెస్టుల్లో నడిపించగల నలుగురైదుగురు ఆటగాళ్లు ఉన్నారని నేను భావిస్తున్నాను. అన్నింటికీ కాలమే సమాధానం చెపుతుంది' అని బ్రెట్ లీ అన్నాడు.
Also Read: Rajinikanth: తీవ్ర మనోవేదనకు గురవుతున్న రజనీకాంత్.. కారణం ఏంటంటే?
టెస్ట్ కెప్టెన్సీ పూర్తిగా భారత మేనేజ్‌మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. మాత్రం చెప్పగలను టీమిండియాను టెస్టుల్లో నడిపించగల నలుగురైదుగురు ఆటగాళ్లు ఉన్నారు' అని ఒమన్‌లో లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో బిజీగా ఉన్న బ్రెట్ లీ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా టెస్ట్ సారథి ప్యాట్ కమిన్స్ (Pat Cummins) కెప్టెన్సీ గురించి మాట్లాడుతూ... 'ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా చాలా బాగా చేస్తున్నాడు. ఫాస్ట్ బౌలర్లు కెప్టెన్‌గా రాణించగలరని అతను నిరూపించాడు. కమిన్స్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను' అని బ్రెట్ లీ చెప్పాడు.
విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ వదులుకోవడంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) మాట్లాడుతూ... 'ఇది విరాట్ కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. ఆయన నిర్ణయాన్ని గౌరవించాలి. ప్రతిదానికీ ఒక సమయం ఉంటుంది. గతంలో చాలా మంది పెద్ద ఆటగాళ్లు తమ బ్యాటింగ్‌పై దృష్టి సారించేందుకు కెప్టెన్సీని విడిచిపెట్టారు. అప్పుడు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, ఎంఎస్ ధోనీ.. ఇప్పుడు విరాట్ కోహ్లీ కావచ్చు' అని పేర్కొన్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook