ఒక్కదెబ్బతో కోటీశ్వరులైన ఆటగాళ్లు వీరే..!
ఒక్క దెబ్బతో వాళ్ల జీవితం మారిపోయింది. ఐపీఎల్ పుణ్యామా అని అండర్-19 ఆటగాళ్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడైపోయారు.
ఒక్క దెబ్బతో వాళ్ల జీవితం మారిపోయింది. ఐపీఎల్ పుణ్యామా అని అండర్-19 ఆటగాళ్లు రికార్డ్ స్థాయిలో అమ్ముడైపోయారు. కోటీశ్వరులు అయిపోయి జాక్ పాట్ కొట్టేశారు. అండర్-19 జట్టు కెప్టెన్ పృధ్వీషాను ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.1.2 కోట్లకు కొనుగోలు చేసింది. పృధ్వీషాను కొనుగోలు చేయడానికి రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ పోటీపడగా.. చివరకు 1.2 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది.
అలాగే అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు రూ.1.8 కోట్లకు కొనుగోలు చేసింది. గిల్ ను కొనుగోలు చేయడానికి చాలా ఫ్రాంచైజీలు పోటీపడగా.. కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అలానే మరో అండర్-19 ఆటగాడు కమలేష్ నాగర్కోటిని రికార్డ్ స్థాయిలో కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.3.2 కోట్లకు చేజిక్కించుకుంది. శివం మవిని ముంబై ఇండియన్స్ 3 కోట్లకు కొనుగోలు చేసింది. కమలేష్, శివం మవిలు 2018ఐపీఎల్ లో అత్యధిక ధరకు అమ్ముడైపోయిన అండర్-19 ఆటగాళ్లుగా పదకొండో ఐపీఎల్ సీజన్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. వీరి కనీస ధర రూ.20 లక్షలు కాగా కోటిరూపాయలకు పైగా ధరపలికి అందరినీ ఆశ్చర్యపరిచారు.