ఆస్ట్రేలియన్ పేసర్ జేమ్స్ ఫాక్నర్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. తాను గే అని కుండబద్ధలు కొట్టినట్టు స్పష్టంచేసి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశాడీ 29 ఏళ్ల క్రికెటర్. సోమవారం నాడు తన 29వ పుట్టిన రోజు సందర్భంగా తన తల్లి రోజ్లిన్ కెరోల్ ఫాక్నర్, తన బాయ్ ఫ్రెండ్ రాబ్ జెబ్‌తో కలిసి డిన్నర్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంటూ జేమ్స్ ఫాక్నర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. అంతేకాకుండా గత ఐదేళ్లుగా తాను, తన బాయ్ ఫ్రెండ్ డేటింగ్‌లో వున్నట్టు సంచలన ప్రకటన చేశాడు.


జేమ్స్ ఫాక్నర్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే, ఆస్ట్రేలియా తరపున ఆడిన 69 వన్డేలలో 96 వికెట్లు తీసిన ఫాక్నర్.. 1,033 పరుగులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే కాకుండా 24 టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లు ఆడిన ఫాక్నర్ మొత్తం 36 వికెట్లు తీసుకున్నాడు. ఐపిఎల్ టోర్నీలో తాను ఆడిన 60 మ్యాచ్‌లలో 59 వికెట్లు తీసుకుని 527 పరుగులు చేశాడు.