James Pattinson Retires: ఆస్ట్రేలియా​ ఫాస్ట్​ బౌలర్​ జేమ్స్​ పాటిన్సన్ అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ​(James Pattinson Retired) ప్రకటించాడు. క్రికెట్​కు వీడ్కోలు చెప్పి.. తన కుటుంబంతో సమయాన్ని గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే క్రికెట్​కు రిటైర్మెంట్​ ప్రకటించినా.. యువ బౌలర్లను పేసర్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పాడు. ఈ ఏడాది చివర్లో ఇంగ్లాండ్​తో యాషెస్​ సిరీస్​ నేపథ్యంలో జేమ్స్​ పాటిన్సన్​ రిటైర్మెంట్​ ప్రకటించడం పట్ల ఆసీస్​ క్రికెట్ ​(Cricket Australia News) ఫ్యాన్స్​ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
 
గత కొంత కాలంగా వెన్నునొప్పి, మోకాలి గాయంతో (James Pattinson Injury) బాధపడుతున్న జేమ్స్​ పాటిన్సన్​.. క్రికెట్​కు గుడ్​బై చెప్పాలని భావించాడు. 2011లో అంతర్జాతీయ క్రికెట్​లో అడుగుపెట్టిన జేమ్స్​ పాటిన్సన్​.. తన క్రికెట్​ కెరీర్​లో ఇప్పటివరకు 21 టెస్టులు, 15 వన్డేలు, 4 టీ20 మ్యాచ్​లకు (James Pattinson Stats) ఆస్ట్రేలియా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 81 వికెట్లు సాధించగా.. వన్డేల్లో 16, టీ20 ఫార్మాట్​లో 3 వికెట్లను పడగొట్టాడు. ఫస్ట్​క్లాస్​ క్రికెట్​లో 76 మ్యాచ్​లు ఆడిన పాటిన్సన్​.. 302 వికెట్లు సాధించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Cricket and Duckout: క్రికెట్ చరిత్రలో డకౌట్ కాని క్రికెటర్లు ఎవరో తెలుసా


2011లో న్యూజిలాండ్​తో సిరీస్​లో తొలి టెస్టు ఆడిన జేమ్స్​ పాటిన్సన్ (James Pattinson).. ఆ మ్యాచ్​ రెండో ఇన్నింగ్స్​లో 27 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఆ సిరీస్​లో మొత్తంగా 14 వికెట్లు తీసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్​'గా నిలిచాడు.


Also read : T20 World Cup 2021: టీమిండియా ఎప్పుడూ గొప్పలు చెప్పుకోదు: సెహ్వాగ్


Also read : T20 World Cup: ఒకే క్రికెటర్...2 ప్రపంచకప్‌లు..2 వేర్వేరు దేశాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook