AUS vs IND 1st Test Live: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. జస్ప్రిత్ బుమ్రా 5 వికెట్లతో 104కే ఆలౌట్
Australia Bowled Out For 104 Runs India Leads 46 Score: బంతితో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తిప్పేశాడు. ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకే ఆలౌట్ చేసేశాడు. తొలి టెస్టులో భారత్ అదరగొట్టింది.
Jasprit Bumrah Five Wickets: స్వదేశీ గడ్డపై జరిగిన వైట్ వాష్‌తో ఘోర పరాభవం ఎదుర్కొన్న భారత జట్టు ఆ కసినంతా ఆస్ట్రేలియాపై చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. భారత స్టార్ స్పిన్నర్ జస్ప్రీత్ బుమ్రా బంతితో చెలరేగిపోవడంతో సొంత గడ్డపై ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. 104 పరుగులకే కంగారూలు కుప్పకూలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ పైచేయి కనబర్చింది.
ఇది చదవండి: Australia vs India 1st Test: తొలి టెస్ట్‌లో దెబ్బ తీసిన కంగారులు.. కుప్పకూలిన భారత్
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టులో శనివారం ఓవర్‌నైట్ 67/7 స్కోరుతో రెండో రోజు ఆస్ట్రేలియాను ఆటను ప్రారంభించింది. దూకుడు చూపించాలని ప్రయత్నించగా బుమ్రా రూపంలో అడ్డుగోడ తగిలింది. నిలకడగా ఆడుతున్న అలెక్స్ కేరీ (21) అద్భుతమైన బంతికి ఔటవడంతో ఆసీస్ భారీ షాక్‌కు గురయ్యింది. గ్రౌండ్‌లో పాతుకుపోయిన మిచెల్ స్టార్క్‌ను హర్షిత్ రాణా బోల్తా కొట్టించాడు. రిషబ్ పంత్ అద్భుత క్యాచ్ పట్టడంతో స్టార్క్ పెవిలియన్ చేరాడు. 112 బంతులు ఆడిన స్టార్క్ రెండు ఫోర్లతో 26 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో స్టార్క్ చేసిన స్కోర్ అత్యధికం కావడం గమనార్హం. ఆసీస్ ఆలౌట్ కావడంతో భారత్ 46 పరుగుల ఆధిక్యం పొందింది.
భారత్, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. తొలి టెస్టులో మొత్తం 20 వికెట్లు పేసర్లకు దక్కాయి. భారత్ 150 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 104 పరుగులకు పరిమితమైంది. రెండో రోజు భోజనం ముగిసే సమయానికి ఆధిక్యంలో భారత్ ఉండడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను బుమ్రా ముప్పుతిప్పలు పెట్టాడు. ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. 18 ఓవర్లు వేసిన బుమ్రా 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్‌స్వీని, స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్ వికెట్లు బుమ్రా తీశాడు. హర్షిత్ రాణా మూడు వికెట్లు, సిరాజ్ రెండు పడగొట్టాడు.
నితీశ్ భారీ స్కోరర్
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది. అరంగేట్రం చేసిన యువ బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రిషబ్ పంత్ 31 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ (26), ధ్రువ్ జురేల్ (11), జస్ప్రీత్ బుమ్రా (8), హర్షిత్ రాణా (7), విరాట్ కోహ్లీ (5), వాషింగ్టన్ సుందర్ (4) తక్కువ స్కోర్ చేశారు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్ గోల్డెన్ డకౌట్ అయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.