Jasprit Bumrah: టీమిండియాకు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్ 2022 నుంచి బుమ్రా ఔట్!
Jasprit Bumrah ruled out from T20 World Cup 2022. ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2022కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.
Jasprit Bumrah ruled out from T20 World Cup 2022 due to Back Injury: ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ 2022కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మెగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. తీవ్రమైన వెన్ను కారణంగా టీ20 ప్రపంచకప్‌లో పేస్ గుర్రం బుమ్రా ఆడడం లేదు. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇపటివరకు అయితే అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే బుమ్రా విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుందని సమాచారం తెలుస్తోంది.
గాయం కారణంగా ఆసియా కప్ 2022 టీ20 టోర్నీకి జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ద్వారా పునరాగమనం చేశాడు. రెండో టీ20తో ఎంట్రీ ఇచ్చిన బుమ్రా.. వర్షం కారణంగా 8 ఓవర్లకు కుదించిన మ్యాచులో రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మూడో టీ20లో దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లలో ఏకంగా 50 పరుగులు సమర్పించుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో జస్ప్రీత్ బుమ్రా తిరిగి ఫామ్‌లోకి వస్తాడని అందరూ భావించారు. అయితే మరోసారి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ప్రాక్టీసు సెషన్‌లో భాగంగా వెన్ను నొప్పితో బాధపడిన బుమ్రా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో ఆడడం లేదు. వెన్ను నొప్పికి ప్రస్తుతం సర్జరీ అవసరం లేకున్నా.. 4 నుంచి 6 నెలల విశ్రాంతి తప్పనిసరి అని డాక్టర్లు సూచించారట. ఈ సమయంలో బుమ్రా ఎలాంటి ప్రయాణాలు కూడా చేయోద్దట. దాంతో అక్టోబర్ 16 నుంచి ఆరంభం అయ్యే టీ20 ప్రపంచకప్ 2022కి దూరం కానున్నాడు.
Also Read: SSMB28 Aarambham : షూట్ కూడా పూర్తి కాకుండానే షాకిస్తున్న మహేష్ మూవీ రైట్స్
Also Read: ఇప్పుడే లేచావా తల్లి.. రష్మిక మందన్నను ఆటాడుకుంటున్న మహేష్ బాబు ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook