"విరాట్‌ కోహ్లీ నిజంగానే జీనియస్. ఆయన ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మెన్‌" అంటూ పాక్‌ మాజీ క్రికెటర్‌ జావెద్‌ మియాందాద్‌ భారత క్రికెట్ జట్టు రథసారథి విరాట్‌ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. సఫారీలతో జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ 160 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోహ్లీ బ్యాటింగ్‌లో ఓ గొప్ప టెక్నిక్ ఉందని.. అదే టెక్నిక్ వల్ల ఆయన ప్రతి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు రాబడుతున్నారని.. కోహ్లీ నిజంగానే ప్రపంచం గర్వించదగ్గ ప్లేయర్ అని మియాందద్ తెలిపారు.


టెక్నిక్‌తో బ్యాటింగ్ చేసేవారందరూ ఏదో ఒక సందర్భంలో ఫెయిల్ అవుతారని.. కాకపోతే కోహ్లీ విషయంలో అలా జరగదు అని ఆయన అభిప్రాయపడ్డారు. బౌలర్ బలాన్ని,  బలహీనతను క్షుణంగా పరిశోధించి, పరిశీలించి కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడని, అందుకే అతను గొప్ప బ్యాట్స్‌మన్ అయ్యాడని మియాందద్ కోహ్లీకి కితాబు ఇచ్చాడు