Indian Cricketer Shahbaz Nadeem retire from International cricket: టీమిండియా స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ఇంటర్నేనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. యువ క్రికెటర్లకు అవకాశమిచ్చేందుకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఈ సీనియర్ బౌలర్ చెప్పాడు. 2019లో భారత్ క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ జార్ఖండ్ స్పిన్నర్ రెండు టెస్టు మ్యాచ్లు ఆడి 8 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో తనదైన ముద్రవేయలేకపోయిన ఈ ఫ్లేయర్ దేశవాళీలో మాత్రం సత్తా చాటాడు. జార్ఖండ్ తరఫున ఆల్ టైమ్ లీడింగ్ వికెట్ టేకర్ షాబాజ్ నిలిచాడు. 140 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 542 వికెట్ల తీశాడు. ఈ జార్ఖండ్ లెజెండ్ రాజస్థాన్ పై కేవలం 10 పరుగులిచ్చి ఎనిమిది వికెట్లు తీశాడు. ఇవే అతని కెరీర్ లో అత్తుత్తమ గణాంకాలు. వీటితోపాటు 175 లిస్ట్-ఏ వికెట్లు, 125 టీ20 వికెట్లు కూడా తీసుకున్నాడు. అయితే ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ తర్వాత అతనికి టీమిండియా తరఫున ఆడే అవకాశం రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షాబాజ్ నదీమ్ కూడా ఐపీఎల్ లో సత్తా చాటాడు. ఇతడు ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడాడు. మొత్తం 72 ఐపీఎల్ మ్యాచ్ ల్లో 48 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇతడు చివరిసారిగా 2021 ఐపీఎల్ లో ఆడాడు. 2011లో అతడి ప్రదర్శనకు ఐపీఎల్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. 2015-16, 2016-17 రంజీ సీజన్స్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా నదీమ్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్స్ లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 34 ఏళ్ల ఈ సీనియర్ స్పిన్నర్ జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో అతడు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.  


Also Read: R Ashwin: 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్న అశ్విన్.. ఇప్పటి వరకు సాధించిన ఘనతలివే..!


Also Read: T20 WC 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఫ్రీగా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఎక్కడ చూడొచ్చంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook