Ind vs Eng 05th Test-R Ashwin: అనిల్ కుంబ్లే తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అతడు రవిచంద్రన్ అశ్విన్ అనే చెప్పాలి. మార్చి 07న ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరగబోయే టెస్టు మ్యాచ్ ద్వారా అశ్విన్ మరో కీలక మైలురాయిని అందుకోబోతున్నాడు. ఇది అశ్విన్ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ కానుంది. రీసెంట్ గానే అశ్విన్ 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. ఇప్పటి వరకు 99 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ పలు రికార్డులను సృష్టించాడు. అవేంటో తెలుసుకుందాం.
మరో రెండు రోజుల్లో జరగబోయే ధర్మశాల టెస్టు ఆడితే టెస్టుల్లో 100 లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల ఆడిన భారత్ ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ చేరతాడు. ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడిగా అశ్విన్ నిలుస్తాడు. ఇతడు కంటే ముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి, ఇషాంత్ శర్మ, హర్భజన్ సింగ్, ఛెతేశ్వర్ పుజారా, వీరేంద్ర సెహ్వాగ్‌లు భారత్ తరఫున 100+ టెస్టులు ఆడారు.
భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన ఆటగాళ్లు వీరే..
సచిన్ టెండూల్కర్ - 200 మ్యాచ్‌లు
రాహుల్ ద్రవిడ్ - 163 మ్యాచ్‌లు
వీవీఎస్ లక్ష్మణ్ - 134 మ్యాచ్‌లు
అనిల్ కుంబ్లే - 132 మ్యాచ్‌లు
కపిల్ దేవ్ - 131 మ్యాచ్‌లు
సునీల్ గవాస్కర్ - 125 మ్యాచ్‌లు
దిలీప్ వెంగ్‌సర్కార్ - 116 మ్యాచ్‌లు
సౌరవ్ గంగూలీ - 113 మ్యాచ్‌లు
విరాట్ కోహ్లీ - 113 మ్యాచ్‌లు
ఇషాంత్ శర్మ - 105 మ్యాచ్‌లు
హర్భజన్ సింగ్ - 103 మ్యాచ్‌లు
ఛెతేశ్వర్ పుజారా - 103 మ్యాచ్‌లు
వీరేంద్ర సెహ్వాగ్ - 103 మ్యాచ్‌లు
అశ్విన్ ఘనతలు..
అతి పెద్ద వయసులో ఒక టెస్టు మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన భారతీయ బౌలర్‌గా అశ్విన్(37 ఏళ్ల 306 రోజులు) చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా వినూ మన్కడ్ తర్వాత టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతి పెద్ద వయస్కుడు కూడా అశ్వినే. బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ రూపంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ (214; బౌల్డ్ - 101, LBW - 113) రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో అండర్సన్ (233) కొనసాగుతున్నాడు. ఖాతా తెరవకుండానే 74 మంది బ్యాట్స్‌మెన్‌లను అవుట్ చేసి అశ్విన్ రికార్డు సృష్టించాడు. అనిల్ కుంబ్లే (77) తర్వాత టెస్టుల్లో ఏ భారత బౌలర్‌కైనా ఇది రెండో అత్యుత్తమం. అశ్విన్ తన టెస్ట్ కెరీర్‌లో కేవలం 10 నో బాల్స్ మాత్రమే వేశాడు, అవన్నీ 2021 మరియు 2022 మధ్య ఐదు వరుస సిరీస్‌లలో ఉన్నాయి.ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 100 వికెట్లు పూర్తి చేసిన తొలి బౌలర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు.
Also Read: T20 WC 2024: క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఫ్రీగా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లు.. ఎక్కడ చూడొచ్చంటే?
Also Read: IPL 2024: చెన్నైకు భారీ షాక్.. ఐపీఎల్ మొదలుకాకముందే విధ్వంసక బ్యాటర్ దూరం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook