IPL 2022 : ఐపీఎల్ 2022లో కీలక మార్పులు, కెప్టెన్‌గా తప్పుకోనున్న ఎంఎస్ ధోని
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. జట్టు ఆటగాళ్లు, కెప్టెన్సీ, కొత్త ఫ్రాంచైజీలతో విభిన్నంగా ఉండనుంది. ఈసారి ఎంఎస్ ధోని సైతం కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని తెలుస్తోంది.
IPL 2022 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. జట్టు ఆటగాళ్లు, కెప్టెన్సీ, కొత్త ఫ్రాంచైజీలతో విభిన్నంగా ఉండనుంది. ఈసారి ఎంఎస్ ధోని సైతం కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని తెలుస్తోంది.
ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు అత్యంత విజయవంతమైందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కెప్టెన్‌గా ఎంఎస్ ధోని అద్భుత విజయాలు అందించాడు. ఐపీెల్ 2010, 2011, 2018, 2021 సీజన్లలో టైటిల్ అందించాడు. ఎంఎస్ ధోని లేని సీఎస్‌కే (CSK)జట్టును చూడాలంటే కష్టమే. మిస్టర్ కూల్‌గా పిల్చుకునే ఎంఎస్ ధోని ఈసారి ఐపీఎల్‌లో కెప్టెన్సీ బాధ్యతల్నించి తప్పుకోనున్నాడని తెలుస్తోంది.
ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్‌లో సీఎస్‌కే జట్టు కెప్టెన్సీ మారనుంది. ధోనీ స్థానంలో టీమ్ ఇండియా ఆల్ రౌండర్, చెన్నై సూపర్‌కింగ్స్ సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాకు (Ravindra Jadeja) పగ్గాలు అప్పగించాలని స్వయంగా ధోనీనే భావిస్తున్నాడు. ఈ మేరకు ఇప్పటికే జట్టు యాజమాన్యంతో చర్చించినట్టు సమాచారం. ఎంఎస్ ధోనికి (MS Dhoni) ఆటగాడిగా కూడా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కానుంది. ఇప్పటికే ఐపీఎల్ 2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, రుతురాత్ గైక్వాడ్, మొయిన్ అలీలను రిటైన్ చేసుకుంది. వదులుకున్న డుప్లెసిస్‌ను తిరిగి జట్టులోకి చేర్చుకోనుంది.
Also read: Ashes 2021-22: చివరి టెస్టులో ఇంగ్లాండ్ ఘోర పరాజయం.. 4-0 తేడాతో సిరీస్ ఆసీస్ కైవసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook