India Open 2022 Corona Cases: ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. న్యూఢిల్లీ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో ఏడుగురు భారతీయ షట్లర్లు కరోనా బారిన పడ్డారు. వారిలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, అశ్విని పొన్నప్ప, రితికా ఠక్కర్, ట్రీసా జాలీ, మిథున్ మంజునాథ్, సిమ్రాన్ సింగ్, ఖుషీ గుప్తాలు ఉన్నారు. ఇదే విషయాన్ని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ లో ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఇండియా ఓపెన్ 2022 టోర్నీలో భాగంగా కొవిడ్ టెస్టులు నిర్వహించగా అందులో ఏడుగురు కరోనా బారిన పడ్డారు. మంగళవారం వారికి నిర్వహించిన RT-PCR పరీక్షల్లో ఆటగాళ్లకు పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆ ఏడుగురు ఆటగాళ్లతో సన్నిహితంగా ఉన్న డబుల్స్ క్రీడాకారులు కూడా టోర్నీని విరమించుకున్నారు" అని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్వీట్ చేసింది. 



టోర్నీలో కరోనా కేసులు నమోదైన కారణంగా ఇండియా ఓపెన్ 2022 నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. కరోనా సోకిన ఆటగాళ్లను ఐసోలేషన్ కు పంపడం సహా మిగిలిన ఆటగాళ్లకు కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నారు.  


కిదాంబి శ్రీకాంత్ ప్రస్తుతం బ్యాడ్మింటన్ సింగిల్స్ ర్యాంకింగ్స్ లో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల డబుల్స్ లో అశ్విని పొన్నప్ప ప్రపంచ ర్యాంకింగ్స్ లో నంబరు 20లో కొనసాగుతుంది. డబుల్స్ లో ఈమెకు జోడీగా సిక్కిరెడ్డి ఆడుతుంది. 


2019లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్నీలో కాంస్య పతకాన్ని సాధించిన భారత షట్లర్ బి.సాయి ప్రణీత్ కూడా గతవారం కొవిడ్ బారిన పడ్డాడు. కరోనా సోకిన తర్వాత ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రణీత్ ప్రకటించాడు. 


ఇండియా ఓపెన్ 2022 బ్యాడ్మింటన్ టోర్నీలో భాగంగా 2వ రౌండ్ మ్యాచ్ లు గురువారం (జనవరి 13) నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే కరోనా బారిన పడిన ఏడుగురు భారత షట్లర్లు స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ధ్రువీకరించింది.  


Also Read: Jasprit Bumrah vs Marco Jansen: మార్కో.. బుమ్రా అంటే ఫ్లవర్ అనుకుంటివా?.. ఫైరూ! తగ్గేదేలే!!


Also Read: IND vs SA: సింపుల్ క్యాచ్‌ మిస్‌ చేసిన పుజారా.. టీమిండియాకు ఐదు పరుగుల పెనాల్టీ!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook