ఐపీఎల్‌ 11లో మరో ఆసక్తికరమైన మ్యాచ్ అభిమానుల పల్స్ రేట్ పెంచేసింది‌! మొహాలి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ విజయకేతనం ఎగురవేసింది. కేవలం 198 పరుగుల లక్ష్యాన్ని చేరడం కోసం మహేంద్ర సింగ్ ధోనీ (79 నాటౌట్‌; 44 బంతుల్లో 6×4, 5×6) చేసిన భీకర పోరాటం ఐపీఎల్ చరిత్రలోనే నిలిచిపోతుంది అన్నంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే ఉత్కంఠతను కూడా పెంచింది. అతనితో పాటు అంబటి రాయుడు (49; 35 బంతుల్లో 5×4, 1×6) కూడా సాధ్యమైనంత వరకూ పరుగులు రాబట్టడానికి ప్రయత్నించడంతో చెన్నై ఏదైనా మ్యాజిక్ చేయగలదా... అని భావించారంతా. కానీ ఆఖరి నాలుగు బంతుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌  విజయ లక్ష్యం చేరుకోవాలంటే 16 పరుగులు తప్పకుండా చేయాల్సి ఉండగా.. ధోనీ  కేవలం10 పరుగులు మాత్రమే చేయడంతో అపజయం అనేది తప్పలేదు.


అంతకు ముందు కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్ ఆడిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ (63) అదరగొట్టాడు. అతడికి తోడుగా రాహుల్‌ (37), కరుణ్‌ నాయర్‌ (29) కూడా పరుగుల వరద పారించడంతో పంజాబ్ చెప్పుకోదగ్గ స్కోరే చేయగలిగింది. కానీ ధోనీ ఒక్కడే చెన్నై తరఫున మ్యాచ్ నిలబెట్టడానికి ప్రయత్నించాడు. అయినా అనూహ్యమైన ఆట కథను మలుపు తిప్పడంతో ధోని సేనకు ఓటమి తప్పలేదు