Dwayne Bravo: ఐపీఎల్ చరిత్రలో డ్వేన్ బ్రావో అరుదైన ఘనత
KKR vs CSK IPL 2020 | చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో (Dwayne Bravo) అరుదైన ఘనత సాధించాడు. తన 37వ పుట్టినరోజు నాడు లీగ్ చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకున్న ఐదవ బౌలర్‌గా డ్వేన్ బ్రావో నిలిచాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2020)లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో (Dwayne Bravo) అరుదైన ఘనత సాధించాడు. లీగ్ చరిత్రలో 150 వికెట్ల మైలురాయిని అందుకున్న ఐదవ బౌలర్‌గా డ్వేన్ బ్రావో నిలిచాడు. తన 37వ పుట్టినరోజు నాడు ఈ ఘనత అందుకోవడం విశేషం. అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders)తో మ్యాచ్‌లో భాగంగా బ్రావో ఈ ఘనత సాధించాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో శివమ్ మావిని పెవిలియన్‌కు చేర్చడంతో తన ఖాతాలో 150వ ఐపీఎల్ వికెట్‌ను జమ చేసుకున్నాడు ఈ ఆల్ రౌండర్.
Also read : Prithvi Raj Yarra: సన్‌రైజర్స్ టీమ్‌లోకి పృథ్వీరాజ్.. ఎవరీ తెలుగు తేజం ?
రెండు పర్యాయాలు (2 ఐపీఎల్ సీజన్లు) పర్పుల్ క్యాప్ సైతం దక్కించుకున్నాడు డ్వేన్ బ్రావో (Dwayne Bravo). చెన్నై సూపర్ కింగ్స్ విజయాలలో కీలకపాత్ర పోషిస్తున్న డ్వేన్ బ్రావో.. 137 మ్యాచ్‌లాడి 102 ఇన్నింగ్స్‌లలో 1,483 పరుగులు చేశాడు. బెస్ట్ బ్యాట్స్‌మన్ అయినప్పటికీ బ్యాట్ కన్నా బంతితోనే చెన్నై జట్టుకు విజయాలు అందించాడు ఈ విండీస్ క్రికెటర్. గత కొన్నేళ్లుగా సీఎస్కేకు బ్రావో ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
Also read : Steve Smith: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు భారీ షాక్!
కాగా, ఐపీఎల్ 2020లో 21వ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసిన చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా జట్టు 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. డ్వేన్ బ్రావో 3 వికెట్లతో రాణించాడు.
Also Read : KKR vs CSK match: చెన్నై సూపర్ కింగ్స్‌పై కోల్‌కతా విజయం.. ధోనీకి మళ్లీ తప్పని ఓటమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe