KKR Vs MI Match Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేడు (ఏప్రిల్ 6) మరో ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబయి ఇండియన్స్ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గకుండా ఉంది. ఈ మ్యాచ్ తోనైనా తొలి విజయాన్ని నమోదు చేసుకునేందుకు తహతహలాడుతుంది. మరోవైపు ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి జోరుమీదున్న కోల్ కతా నైట్ రైడర్స్ మూడో విజయాన్ని నమోదు చేసి టేబుల్ టాప్ పొజిషన్ కు చేరుకోవాలని చూస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి గెలుపు కోసం..


టోర్నీ చరిత్రలో ఇప్పటి వరకు 5 సార్లు విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్.. ప్రస్తుత టోర్నీలో మాత్రం తడబడుతోంది. ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైంది. గతంలో ఢిల్లీ, రాజస్థాన్ టీమ్స్ పై ఓడిపోయిన్ రోహిత్ సేన.. ఇప్పుడు కోల్ కతా పైన గెలవాలని పట్టుదలతో ఉంది. 


బ్యాటింగ్ విషయానికొస్తే ముంబయి టీమ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ విఫలమయ్యారు. ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. మిడిల్ ఆర్డర్ లో ఒకరిద్దరు మినహా మిగిలిన బ్యాటర్లు రాణించలేకపోయారు. బౌలింగ్ లో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.  


మూడో గెలుపు కోసం పోరాటం..


గతేడాది టోర్నీ ఫైనల్ వరకు వెళ్లిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు.. త్రుటిలో కప్ ను చేజార్చుకుంది. కోల్ కతా టీమ్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో విజయం సాధించగా, ఒక మ్యాచ్‌లో పరాజయం పాలైంది. అయితే చెప్పుకొదగ్గ విషయమేమిటంటే పాయింట్ల పట్టికలో ఈ టీమ్ రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ముంబయిపై గెలిస్తే మాత్రం కేకేఆర్ అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. వరుస విజయాలతో దూకుడుగా ఉన్న శ్రేయస్ అయ్యర్ సేనలో ఈ మ్యాచ్ కోసం ఎలాంటి మార్పులు జరగకపోవచ్చు. 


తుదిజట్లు (అంచనా):


ముంబయి ఇండియన్స్: 


రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అన్మోల్ ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కిరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డానియల్ శామ్స్, మురుగన్ అశ్విన్, జస్పిత్ బుమ్రా, త్యామల్ మిల్స్, బాసిల్ తంపి. 


కోల్ కతా నైట్ రైడర్స్:


అజింక్య రహానె, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, శామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), ఆండ్రూ రస్సెల్, సునీల్ నరైన్, టిమ్ సౌథీ, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.  


Also Read: RR vs RCB: రాజస్థాన్ రాయల్స్ ఓటమి, 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం


Also Read: RR vs Bangalore: జోస్ బట్లర్ హాఫ్ సెంచరీ... చివర్లో మెరుపులు... బెంగళూరు టార్గెట్ 170...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook