Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad Playing 11: ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ నేడు తొలి మ్యాచ్‌ ఆడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌ పోరుతో మొదలుపెట్టనుంది. కొత్త కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న సన్‌రైజర్స్.. ఈసారైనా మెరుగైనా ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కెప్టెన్సీ మార్పుతో ఎస్‌ఆర్‌హెచ్‌ తలరాత మారుతుందని నమ్మకంతో ఉన్నారు. అటు గాయంతో గతేడాది సీజన్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్.. ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి తీసుకున్న అయ్యర్.. జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేకేఆర్ మొదట బ్యాటింగ్ ఆరంభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Xiaomi Civi 4 Pro: ప్రపంచంలో మొదటిసారిగా రెండు సెల్ఫీ కెమేరాలతో షియోమీ ఫోన్ లాంచ్


"మా దగ్గర మంచి బౌలింగ్ దళం ఉంది. వికెట్ చాలా బాగుంది. నాతోపాటు జాన్సెన్, క్లాసెన్, మార్క్రామ్ తుది జట్టులో ఉన్నారు. సన్‌రైజర్స్‌ తరుఫున ఇది నా మొదటి గేమ్. క్యాంప్‌లో లీడ్ అప్‌కు ఇది అద్భుతంగా ఉంది. ఆరెంజ్ గ్రూప్‌లో విశ్వాసం ఎక్కువగా ఉంది." ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు.


"గాయం నుంచి కోలుకుని రావడం అద్భుతంగా ఉంది. నేను బాగా ట్రైనింగ్ తీసుకున్నాను. కొన్ని మ్యాచ్‌లు కూడా ఆడాను. గత కొన్ని సీజన్లలో స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఈ వికెట్‌పై కొంచెం పొడిబారినట్లు కనిపిస్తోంది. అది స్పిన్నర్లకు సహాయపడుతుందని నమ్ముతున్నా. సాల్ట్, నరైన్, రస్సెల్, స్టార్క్ ఈరోజు ఆడుతున్నారు.." అని కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు.


తుది జట్లు ఇలా..


సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి.నటరాజన్


కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.


Also Read:  V Hanumanth Rao: రేవంత్ రెడ్డి రెండు సైడ్ లు వినాలే.. సంచలన వ్యాఖ్యలు చేసిన వీ.హనుమంత రావు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter