Congress Senior Leader Comments V Hanumanth Rao On CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ వినకు రెండు సైడ్స్ వినాలని కోరుతున్ననంటూ కాంగ్రెస్ సీనియల్ నేత వీ.హనుమంతరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేది తన ఆవేదన అంటూ వీహెచ్ అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ వద్దని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ క్యాడర్ కు న్యాయం చేయకుండా మన కార్యకర్తల పై కేసులు పెట్టినవాళ్లకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి ఓక్కడేనని, పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాడని రేవంత్ ను కొనియాడారు.కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్ పేర్కొన్నారు.
Read More: Girls Romance In Metro: మెట్రోలో ముద్దులు పెట్టుకుంటూ అమ్మాయిల రొమాన్స్..
రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి.. నిన్ను కలవాలంటే నీ దగ్గరకు వాళ్ళు రావాలి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్ కాదు. నీ స్థాయి నువ్వే తగ్గించుకుంటున్నావంటూ.. వీహెచ్ చేసిన కామెంట్లు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ హాయాంలో ఆపార్టీలో ఉండి ఉన్నత పదువుల్లో ఫుల్ గా ఎంజాయ్ చేసి, అక్రమంగా డబ్బు సంపాదించి ఇప్పుడు అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. ఏ విషయాన్నైన రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ వినకుండా.. రెండు సైడ్స్ వినాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయo చేయవద్దని సూచించారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా చూడాలనేదే తను కోరుకుంటున్నట్లు వీహెచ్ అన్నారు. ఇదిలా ఉండగా...తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున ఇతర పార్టీల నుంచి వలసలు వస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఎంపీలు,ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు, హైదరాబాద్ కు చెందిన కార్పోరేటర్లు కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. ఇక మరోవైపు తాజాగా, హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, బీఆర్ఎస్ ఎంపీ కేకేశవరావు ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో చేరాల్సిందిగా ఆహ్వానించారు.
Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..
ఇక హైదరాబాద్ మేయర్ గద్వాల తక్కువ సమయంలో ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి ఓక్కడే. పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసి కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంటికి వెళ్లి కలిశారు. తమ పార్టీలోకిరావాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. ఇక.. మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం దాదాపు ఖరారైపోయినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook