KL Rahul Ruled Out: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ కు ముందు టీమ్ఇండియాకు (India Vs New Zealand Test Series) గట్టి ఎదురు దెబ్బతగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయంతో (KL Rahul Injury) ఈ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇదే విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI News) అధికారికంగా ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ (kl rahul injury) గాయంతో తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని ట్వీట్ చేసింది. ఎడమ తొడ కండరాల సంబంధిత గాయంతో కేఎల్‌ రాహుల్ బాధపడుతున్నట్లు వెల్లడించింది. నవంబర్‌ 25 నుంచి కాన్పూర్‌ వేదికగా మొదటి టెస్టు (IND Vs NZ 1st Test 2021) మ్యాచ్‌ ప్రారంభం కానుంది.


కివీస్‌తో తొలి టెస్టుకు కేఎల్‌ రాహుల్‌ గైర్హాజరు నేపథ్యంలో మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి శుభ్‌మన్‌ గిల్‌ ఓపెనింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. అలానే రాహుల్‌కు బదులు సూర్యకుమార్‌ యాదవ్‌కు జట్టులో స్థానం దక్కింది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తే మాత్రం.. రహానె, శ్రేయస్‌, వృద్ధిమాన్‌తో కలిసి భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌ పర్యటనకు టీమ్‌ఇండియా జట్టుతోపాటు వెళ్లిన సూర్యకుమార్‌కు తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇప్పుడు మళ్లీ టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. విరాట్‌ కోహ్లీ విశ్రాంతి నేపథ్యంలో తొలి టెస్టుకు అజింక్యా రహానె సారథ్యం వహిస్తుండగా.. ఛెతేశ్వర్‌ పుజారా వైస్‌కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు.


న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ కు టీమ్ఇండియా జట్టు:


అజింక్యా రహానె (కెప్టెన్‌), ఛెతేశ్వర్‌ పుజారా (వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్‌ అయ్యర్, వృద్ధిమాన్‌ సాహా (వికెట్ కీపర్‌), కేఎస్ భరత్‌ (వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, అశ్విన్, అక్షర్‌ పటేల్, జయంత్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేష్ యాదవ్‌, మహ్మద్ సిరాజ్‌, ప్రసిధ్‌ కృష్ణ. 


Also Read: వరుసగా రెండోసారి ముస్తాక్ అలీ ట్రోఫీని ముద్దాడిన తమిళనాడు టీమ్


Also Read: వాటే స్టన్నింగ్ క్యాచ్: అరే ఏంట్రా ఈ క్యాచ్.. సోధి సింగిల్ హ్యాండ్.. షాక్‌లో రోహిత్.. వైరల్ వీడియో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook