వాటే స్టన్నింగ్ క్యాచ్: అరే ఏంట్రా ఈ క్యాచ్.. సోధి సింగిల్ హ్యాండ్.. షాక్‌లో రోహిత్.. వైరల్ వీడియో!

న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో ఇష్‌ సోధి రోహిత్ శర్మ క్యాచ్ పట్టిన తీరు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ క్యాచ్ కు రోహిత్ శర్మ కూడా ఎలా ఆశ్చర్యపోయాడో మీరే చూడండి..   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2021, 12:11 PM IST
  • స్టన్నింగ్ క్యాచ్ పట్టిన ఇష్‌ సోధి
  • నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో
  • క్యాచ్ కు స్టన్నయిన రోహిత్ శర్మ
వాటే స్టన్నింగ్ క్యాచ్: అరే ఏంట్రా ఈ క్యాచ్.. సోధి సింగిల్ హ్యాండ్.. షాక్‌లో రోహిత్.. వైరల్ వీడియో!

Ish Sodhi Stunning Catch in One Hand: న్యూజిలాండ్ (New Zealand) తో జరిగిన మూడో టీ 20లో నెగ్గి పేటీఎం (Paytm T 20 Series) సిరీస్ ను టీమిండియా (Team India) కైవసం చేసుకుంది. ఈడెన్​ గార్డెన్స్​​ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్​లోనూ 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై గెలిచిన భారత్ పూర్తి ఆధిక్యాన్ని కనపబరచింది. ఫలితంగా.. 3-0 ఆధిక్యంతో టీమిండియా విజేతగా నిలిచింది. 

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పయి 184 పరుగులు చేసింది. రోహిత్​శర్మ(56) హాఫ్​ సెంచరీ మరియు బౌలర్​ అక్సర్ పటేల్​ 3 వికెట్లు తీసి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. 185 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ టీమ్.. భారత బౌలర్ల ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది​.

Also Read: PM Kisan Scheme: రూ.55-రూ.200 కట్టండి.. నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందండి.. రైతులకు మాత్రమే

అయితే రోహిత్ శర్మ (Rohit Sharma) అవుట్ అయిన క్యాచ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. 12 వ ఓవర్ వేసిన ఇష్‌ సోధి.. రెండో బంతిని రోహిత్ శర్మ భారీ షాట్ కొట్టబోయాడు.. అయితే బౌలింగ్ వేస్తున్న ఇష్‌ సోధి సింగిల్ హ్యాండ్ తో (Ish Sodhi Single Hand Catch) క్యాచ్ పట్టుకున్నాడు.. వీడియో చూసిన నెటిజన్లు సూపర్ క్యాచ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. 

కొంత మంది "సూపర్ మ్యాన్ సూపర్ క్యాచ్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మరి కొంత మంది "అవెంజర్" సినిమాలో "డాక్టర్ స్ట్రేంజ్" స్టోన్ ను గాల్లోంచి ఎలా తీసాడో.. ఇష్‌ సోధి కూడా గాల్లోంచి బంతిని తీసినట్టు అనిపించిందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరైతే.. "ఈ ఇయర్ స్టన్నింగ్ అండ్ అన్ ఎక్స్పెక్టేడ్" క్యాచ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. నెటిజన్లను అంతగా ఆకట్టుకుంటున్న ఆ వీడియోని మరోసారి మీరే చూడండి. 

Also Read: బ్రేకింగ్: నీటి ప్రవాహంలో చిక్కుకున్న బస్సు.. 30 మంది మహిళల ప్రాణాలు కాపాడిన స్థానికులు

ఫలితంగా.. భారత్ లో జరిగిన పేటీఎం టీ 20 సీరీస్ లో న్యూజిలాండ్ ను క్లీన్ స్వీప్ చేసింది. వరల్డ్ కప్ లో ఘోర పరాభవానికి నిరాశకు గురైన అభిమానులకు ఈ సీరీస్ గెలవటం కొంచెం ఊరట కలిగించిందని చెప్పాలి. అంతేకాకుండా.. ఇటు కెప్టెన్ గా రోహిత్ శర్మకు.. కోచ్ గా  రాహుల్ ద్రావిడ్ తొలి విజయం అవటం విశేషం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News