IPL 2020 ప్రారంభానికి ముందే కేకేఆర్‌కు ఎదురుదెబ్బ
ఐపీఎల్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు (Harry Gurney ruled out of IPL 2020) వెల్లడించాడు. కేకేఆర్ జట్టుకు ఇది నిజంగానే మింగుడు పడని అంశం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలర్ హ్యారీ గర్నీ (Harry Gurney) టోర్నీ మొదలుకాకముందే ఐపీఎల్ తాజా సీజన్ నుంచి వైదొలుగుతున్నట్లు (Harry Gurney ruled out of IPL 2020) ట్వీట్ చేశాడు. భుజం గాయం కారణంగా అతడు కొన్ని నెలలపాటు విశ్రాంతి తీసుకోనున్నాడని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో రిపోర్ట్ చేసింది. హ్యారీ గర్నీ యూఏఈకి వెళ్లడం లేదని, కేకేఆర్ జట్టుకు ఈ సీజన్‌లో విదేశీ పేసర్ దూరం కానున్నాడని తెలిపాడు. Gold Rate: దిగొచ్చిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి
చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్‌లు మొదలయ్యాయని సంతోషిస్తుండగానే తాను గాయపడ్డందుకు బాధగా ఉందన్నాడు హ్యారీ గర్నీ. గతేడాది తొలిసారి కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన గర్నీ.. ఈ సీజన్‌లో రాణించి తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. కానీ గాయం కారణంగా ఐపీఎల్ 2020 నుంచి ఆరంభానికి ముందే నిష్క్రమించాడు. Effects Of Skipping Breakfast: బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే ఎన్ని నష్టాలో తెలుసా..!
Malaika Arora Yoga Pics: నటి మలైకా అరోరా యోగా ఫొటోస్ ట్రెండింగ్
నాటింగ్‌హామ్ షైర్‌లో గత మూడు టీ20 సీజన్లలో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేసర్ హ్యారీ దూరం కావడంతో కేకేఆర్ విదేశీ ఆటగాళ్ల సంఖ్య 7కు తగ్గిపోయింది. కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. Badam Benefits: ఉదయాన్నే బాదం తింటున్నారా.. ఈ ప్రయోజనాలు తెలుసా!
Health Tips: జలుబు వస్తే కంగారొద్దు.. కరోనానో కాదో ఇలా గుర్తించండి
ఆహా అనిపిస్తున్న ‘ఆహా కళ్యాణం’ నటి ఫొటోలు