KKR pacer Pat Cummins ruled out from IPL 2022 due to Injury: కోల్‌కతా నైట్ రైడర్స్‌ (కేకేఆర్‌) స్టార్ బౌలర్‌ పాట్‌ కమిన్స్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 నుంచి వైదొలిగాడు. తుంటి ఎముక గాయం కారణంగా కమిన్స్‌ ఐపీఎల్ 2022 నుంచి తప్పుకుంటున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో కమ్మిన్స్ ఆస్ట్రేలియాలోని సిడ్నీకి వెళ్లడానికి ఐపీఎల్ బయోబబుల్‌ను వీడాడు. గాయం తీవ్రమైనదేం కాదని, రెండు వారాల్లో పూర్తి ఫిట్‌నెస్‌ని సాధిస్తాడని జట్టు వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెలలో శ్రీలంక పర్యటన ఉన్న కారణంగా కమిన్స్‌ ఐపీఎల్‌ వీడినట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంకతో జరగబోయే వన్డే, టెస్టులకు అందుబాటులో ఉండాలని పాట్‌ కమిన్స్‌ భావించాడు. అందుకే ప్రస్తుతం స్వదేశానికి పయనమయిన అతడు సిడ్నీలోని రీహాబిలిటేషన్‌ సెంటర్‌కు చేరుకోనున్నాడు. లంకతో టీ20 సిరీస్‌కు కమిన్స్‌ దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఈ సిరీస్‌ జరగడంపై అనుమానాలు ఉన్నాయి. అయితే దుబాయ్‌ వేదికగా సిరీస్‌ను నిర్వహించాలనే యోచనలో లంక్ బోర్డు ఉందని సమాచారం.


కోల్‌కతా నైట్ రైడర్స్‌ చావోరేవో తేల్చుకోవాల్సిన చివరి రెండు మ్యాచ్‌లకు పాట్ కమ్మిన్స్ దూరం కావడం ఆ జట్టుకు పెద్ద ఎద్దురుదెబ్బ అని చెప్పొచ్చు. కేకేఆర్‌ ప్లే ఆఫ్ అవకాశాలను దెబ్బతీయొచ్చు. ఐపీఎల్ 2022లో కొన్ని మ్యాచ్‌లలో కమ్మిన్స్ బెంచ్‌కే పరిమితం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన ఆసీస్ పేసర్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు 15 బంతుల్లో 56 పరుగులు చేసి  ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీని తన ఖాతాలో వేసుకున్నాడు. 


ఐపీఎల్ 2022లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన పాట్ కమిన్స్‌ 63 పరుగులతో పాటు బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీశాడు. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడగా.. 5 విజయాలు అందుకుని, ఏడు ఓటములను ఎదుర్కొంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్‌కతా ఏడో స్థానంలో ఉంది. కేకేఆర్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్‌ వెళ్లడం కష్టమే. ఇతర జట్ల అవకాశాలపై ఆ జట్టు ఆధారపడాల్సి ఉంటుంది. 


Also Read: SVP First Day Collections: బాక్సాఫీస్‌పై మహేశ్‌ బాబు దండయాత్ర.. తొలిరోజు రికార్డు కలెక్షన్స్‌!


Also Read: Karate Kalyani Vs Srikanth Reddy: ముదురుతోన్న వివాదం... కరాటే కల్యాణితో ప్రాణ హాని ఉందన్న ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook