IPL 2021: ముంబయిపై 7 వికెట్ల తేడాతో కోల్‌కతా గెలుపు
IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌కి ఘోర పరాభవం ఎదురైంది. అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో ముంబయిపై ఘన విజయం సాధించింది.
IPL 2021, MI vs KKR: ఐపీఎల్ 2021(IPL 2021) సెకండ్ ఫేజ్‌లో కేకేఆర్ మరో విజయాన్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలిచింది.
ముంబై విధించిన 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్(Kolkata Knight Riders) ఓవర్‌కు 9కి తగ్గకుండా ఆద్యంతం దూకుడుగా ఆడింది. ముఖ్యంగా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(53 పరుగులు, 30 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు) డెబ్యూ ఫిప్టీతో ఆకట్టుకోగా.. రాహుల్ త్రిపాఠి(74 నాటౌట్ , 42 బంతులు; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి వరకు నిలిచి కేకేఆర్(KKR)కు ఘన విజయాన్ని అందించాడు. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీశాడు. తాజా విజయంతో కోల్‌కతా 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 5 ఓటములతో నాలుగో స్థానానికి చేరుకోగా.. వరుసగా రెండో ఓటమితో ముంబై ఇండియన్స్ ఆరో స్థానానికి పడిపోయింది.
Also read: IPL 2021: సన్‌రైజర్స్‌పై ఢిల్లీ గెలుపు...టాప్‌లోకి పంత్ సేన..
ఈ మ్యాచులో కేకేఆర్ టీం టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై ఇండియన్స్(Mumbai Indians) టీం తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. డికాక్ (55: 42 బంతుల్లో 4x4, 3x6) హాఫ్ సెంచరీతో రాణించాడు. రోహిత్(Rohith) శుభారంభం అందించినా..భారీ స్కోరుగా మలచడంలో విఫలమయ్యాడు. చివర్లో పొలార్డ్ 21, కృనాల్ 12 పరుగులతో స్కోరును పెంచే ప్రయత్నం చేశారు. అయితే ఆఖరి ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ముంబై నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, లోకి ఫెర్గూసన్ చెరో రెండు వికెట్లు తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook