IPL 2021: సన్‌రైజర్స్‌పై ఢిల్లీ గెలుపు...టాప్‌లోకి పంత్ సేన..

IPL 2021: ఐపీఎల్‌ 14వ సీజన్‌ మెుదటి ఎడిషన్ లో రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్..అదే జోరును రెండో అంచెలోనూ కొనసాగిస్తోంది. బుధవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2021, 01:12 PM IST
  • సన్‌రైజర్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు
  • రాణించిన శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన ఢిల్లీ
IPL 2021: సన్‌రైజర్స్‌పై ఢిల్లీ గెలుపు...టాప్‌లోకి పంత్ సేన..

DC vs SRH : ఐపీఎల్‌(IPL 2021) 14వ సీజన్‌ రెండో ఎడిషన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమితో ప్రారంభించింది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ నిరాశ పరిచింది.. సన్‌రైజర్స్‌ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఇంకా 2.5 ఓవర్లు మిగిలి ఉండగానే ఢిల్లీ చేధించింది. సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్స్‌ సక్సెస్‌ అయితే ఆ స్కోరును సునాయాసంగా చేధించడంలో బ్యాట్స్‌మెన్‌ విజయవంతమయ్యారు. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ విజయభేరి మోగించింది. 

మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌(Sunrisers Hyderabad) నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ కేవలం రెండు వికెట్లను కోల్పోయి 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్‌ (42), శ్రేయస్‌ అయ్యర్ (41 నాటౌట్‌) రాణించడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) అగ్రస్థానానికి చేరుకుంది.

Also Read: IPL 2021: ఐపీఎల్‌ను వెంటాడుతున్న కోవిడ్ 19... SRH ప్లేయర్ నటరాజన్ కు కరోనా పాజిటివ్..!

ఇక సన్‌రైజర్స్‌ ఓటమికి జట్టు స్కోరు పరిమితంగా ఉండడమే కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా డేవిడ్‌ వార్నర్‌ (0), విలియమ్సన్‌ (18) పరుగులకే వెనుతిరగడంతో జట్టు స్కోరుపై తీవ్ర ప్రభావం పడింది. వీరిద్దరు రాణిస్తే సన్‌రైజర్స్‌ ఢిల్లీకి కనీసం పోటీనిచ్చేది కానీ.. బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేయడంతో సన్‌రైజర్స్‌ స్వల్ప స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. కెప్టెన్ విలియమ్సన్ (18), ఓపెనర్ సాహా (18), మనీశ్‌ పాండే (17), కేదార్‌ (3), హోల్డర్‌ (10) విఫలమయ్యారు. మరీ తక్కువ స్కోరు నమోదవుతుందనుకున్న సమయంలో అబ్దుల్‌ సమద్‌ (28), రషీద్‌ ఖాన్‌ (22) రాణించడంతో 134 పరుగులనైనా సన్‌రైజర్స్‌ సాధించగలిగింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News