Sunrisers Hyderabad's: ఐపీఎల్‌-2022(IPL 2022) సీజన్‌కు ముందు తమ కొత్త టీమ్ మేనేజ్‌మెంట్‌ను ప్రకటించింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(Sunrisers Hyderabad). ఎస్‌ఆర్‌హెచ్‌(SRH)కు తొలి టైటిల్‌ అందించిన హెడ్‌కోచ్‌ టామ్‌ మూడీ(Tom Moody)ని కొనసాగిస్తున్నట్లు తెలిపింది. వెస్టిండీస్ మాజీ కెప్టెన్, బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారా(Brian Lara) బ్యాటింగ్ కోచ్‌తో పాటు జట్టు వ్యూహాత్మక సలహాదారుగా నియమితుడయ్యాడు. అదే విధంగా ఆర్సీబీ మాజీ హెడ్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌(Simon Katich)ను అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ మేరకు కొత్త సిబ్బంది వివరాలను ట్విట్టర్ వేదికగా వీడియో రూపంలో పంచుకుంది ఎస్ఆర్ హెచ్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదే విధంగా శ్రీలంక స్పిన్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌(Muttiah Muralitharan) కూడా తమతో ప్రయాణం కొనసాగిస్తారని ప్రకటించింది. అదే విధంగా సౌతాఫ్రికా దిగ్గజ బౌలర్ డేల్‌ స్టెయిన్‌(Dale Steyn)ను బౌలింగ్‌ కోచ్‌గా, హేమంగ్ బదానీను ఫీల్డింగ్ కోచ్ గా నియమించుకున్నట్లు సన్‌రైజర్స్‌ యాజమాన్యం ప్రకటించింది. 




Also Read: IND vs SA: దక్షిణాఫ్రికా జట్టుకు భారీ షాక్.. గాయంతో స్టార్‌ పేసర్‌ ఔట్! భారత బ్యాటర్లకు పండగే!!


కొత్త టీమ్ మేనేజ్‌మెంట్‌ సభ్యులు:
టామ్ మూడీ-హెడ్ కోచ్
సైమన్‌ కటిచ్‌- అసిస్టెంట్ కోచ్
బ్రియన్ లారా-బ్యాటింగ్ కోచ్ మరియు స్ట్రాటిజిక్ అడ్వైజర్
డేల్‌ స్టెయిన్‌-బౌలింగ్ కోచ్
ముత్తయ్య మురళీధరన్-స్పిన్ బౌలింగ్ మరియు స్ట్రాటిజిక్ కోచ్
హేమంగ్ బదానీ-ఫీల్డింగ్ కోచ్


2021లో జరిగిన ఐపీఎల్(IPL-2021)లో సన్ రైజర్స్ ప్రదర్శన నిరాశ పరిచింది. 14 మ్యాచ్ లలో కేవలం మూడు మాత్రమే గెలిచి...అఖరి స్థానంలో నిలిచింది. టీమ్ మేనేజ్ మెంట్ కు, వార్నర్(David Warner)కు మధ్య వివాదం జట్టు ప్రదర్శనపై పడింది. అయితే వార్నర్ టీ20 వరల్డ్ కప్ లో అదిరిపోయే ప్రదర్శన చేసి..ఆస్ట్రేలియాకు కప్ అందించాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి