Anushka Sharma and Virat Kohli to plan New Year 2023 celebrations at Dubai: మరోకొన్ని గంటల్లో 2022 సంవత్సరం ముగిసిపోనుంది. ప్రపంచమంతా కొత్త ఏడాది 2023కి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్నిచోట్ల న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి. కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలికేందుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లారు. ప్రస్తుతం దుబాయ్‌లో విరుష్క జంట సందడి చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ దుబాయ్‌లో జంటగా చక్కర్లు కొడుతున్నారు. మాల్స్, రెస్టారెంట్స్ అంటూ దుబాయ్‌ని చుట్టేస్తున్నారు. ఈ ఏడాదిలో చివరిసారిగా విరుష్క జంట దుబాయ్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా అక్కడ సూర్యోదయం సమయంలో దిగిన ఓ ఫొటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. '2022 సంవత్సరంలో ఇదే చివరి సూర్యోదయం' అంటూ విరాట్ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.


త్వరలో శ్రీలంకతో జరగనున్న టీ20లకు విరాట్‌ కోహ్లీ దూరమయ్యాడు. మరోవైపు పెళ్లి అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క శర్మ.. కూతురు వామికా అలనాపాలనతో ఫుల్ బిజీగా ఉన్నారు. 2018లో వచ్చిన 'జీరో' సినిమాలో చివరిగా కనిపించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్మాతగా బిజీగా ఉన్న అనుష్క.. ఇటీవల తన సోదరుడు కర్నేష్ శర్మ నిర్మించిన నెట్‌ఫ్లిక్స్ చిత్రం ఖలాలో అతిధి పాత్ర చేశారు. ఝులన్ గోస్వామి జీవితం ఆధారంగా రూపొందించబడిన 'చక్దా ఎక్స్‌ప్రెస్‌'లో ఆమె కనిపించనున్నారు. 



అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని మంచి స్నేహితులు అయ్యారు. రోజులు గడిచేకొద్ది ఆ స్నేహం ప్రేమగా మారింది. ఐదారేళ్లు లవ్‌లో ఉన్న విరుష్క జంట.. 2017 డిసెంబరులో ఇటలీలో జరిగిన వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2019 ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించిన విరుష్క జోడి.. 2021 జనవరి 11న కుమార్తె వామికాకు జన్మనిచ్చింది. 


Also Read: ఐపీఎల్ 2023, ఆస్ట్రేలియా సిరీస్‌కు పంత్ దూరం.. తెలుగు ఆటగాడికి కీపింగ్ బాధ్య‌త‌లు!


Also Read: 1.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన భారతీయ కంపెనీ.. సక్సెస్‌కు అసలు కారణాలు ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.