Ola Electric Scooters: ఈ భారతీయ కంపెనీ 1.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.. సక్సెస్‌కు అసలు కారణాలు ఇవేనా!

Ola Electric Company sold 1.5 lakh Electric Scooters in 2022 Year. 2022 సంవత్సరంలో దాదాపు 1.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను ఓలా ఎలక్ట్రిక్ విక్రయించింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 31, 2022, 03:27 PM IST
  • 1.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన భారతీయ కంపెనీ
  • సక్సెస్‌కు అసలు కారణాలు ఇవే
  • త్వరలో ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి
Ola Electric Scooters: ఈ భారతీయ కంపెనీ 1.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది.. సక్సెస్‌కు అసలు కారణాలు ఇవేనా!

Best Electric Scooter 2022, Ola Electric sold 1.5 lakh Electric Scooters in 2022: బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ 'ఓలా ఎలక్ట్రిక్' ఆగస్టు 2021లో ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. దాంతో ఓలా సంస్థ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. 2022 సంవత్సరంలో దాదాపు 1.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ విషయాన్ని ఓలా ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా ఇ-మోటార్‌సైకిల్ మరియు ఎలక్ట్రిక్ కార్ లాంచ్‌తో సహా తన భవిష్యత్తు ప్రణాళికలను కూడా ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. రాబోయే సంవత్సరాల్లో అనేక ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం అని కంపెనీ తెలిపింది. 

2023-2024లో మాస్-మార్కెట్ స్కూటర్, మాస్-మార్కెట్ మోటార్ సైకిల్ మరియు అనేక ప్రీమియం మోటార్ సైకిళ్లను (స్పోర్ట్స్, క్రూయిజర్‌లు, ఏడీవీలు మరియు రోడ్ బైక్‌లు) లాంచ్ చేయనున్నామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. త్వరలో పలు ప్రపంచ మార్కెట్‌లకు కూడా ఈవీ వాహనాలను ఎగుమతి చేయనుందట. తమ తొలి ఎలక్ట్రిక్ కారును 2024లో విడుదల చేస్తామని, 2027 నాటికి ఆరు విభిన్న ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం ఓలా పోర్ట్‌ఫోలియోలో S1 ఎయిర్, S1 మరియు S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లు ఉన్నాయి.

S1 ఎయిర్ 2.5 kWh బ్యాటరీ ప్యాక్‌ను, S1 3 kWh బ్యాటరీ ప్యాక్‌ను మరియు S1 ప్రో 4 kWh బ్యాటరీ ప్యాక్‌ యూనిట్‌ను కలిగి ఉంటాయి.  ఈ మూడు ఎలక్ట్రిక్ స్కూటర్‌లు పూర్తి ఛార్జింగ్‌తో వరుసగా 101, 141 మరియు 181 కిమీ వెళుతుందని కంపెనీ పేర్కొంది. Ola S1 ఎయిర్ ధర ప్రస్తుతం రూ. 84,999గా ఉంది. ఇక S1 మరియు S1 ప్రో ధరలు వరుసగా రూ. 99,999 మరియు రూ. 1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఆన్ రోడ్ ధర అయితే మరింత పెరుగుతుంది. 

ఓలా ఎలక్ట్రిక్ సంస్థ 2022లో 1.5 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇన్ని స్కూటర్‌లు అమ్ముడుపోవడానికి ప్రధాన కారణాలు రెండు అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. సామాన్యులకు కూడా S1 ఎయిర్, S1 ప్రో, S1 ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ ధరలో అందుబాటులో ఉండడం ఓ కారణం. తక్కువ సమయంలో ఫుల్ ఛార్జింగ్ కావడం మరో కారణం. ఈ రెండు కారణాలతోనే ఓలా ఎలక్ట్రిక్ సక్సెస్ అయిందట. 

Also Read: Budh Margi 2023: బుధుని ప్రత్యక్ష సంచారం.. ఈ రాశుల వారు కొత్త సంవత్సరంలో నోట్ల కట్టలతో ఆడుకుంటారు!  

Also Read: Shahid Afridi Daughter Marriage: అంగరంగ వైభవంగా షాహిద్ అఫ్రిదీ కూతురు పెళ్లి.. పెళ్లికొడుకు షాహిన్‌ ఆఫ్రిదీ కాదు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News