Kapil Dev on Hardik Pandya:  టీమ్ ఇండియా ప్లెయర్​ హార్ధిక్ పాండ్యపై సంచలన వ్యాఖ్యలు చేశాడు మాజీ క్రికెటర్​ కపిల్ దేవ్. హార్ధిక్ పాండ్యాను ఆల్​-రౌండర్​గా పిలవడంపై అభ్యంతరం వ్యక్తం (All rounder Hardik Pandya) చేశాడు. పాండ్యా బౌలింగ్ చేయనప్పుడు అతన్ని ఆల్​రౌండర్​ అని ఎలా పిలుస్తారు? అంటూ ప్రశ్నించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి సిరీస్​లలో హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయడం ఎప్పుడూ చూడలేదని పేర్కన్నాడు కపిల్​. ఇంకొన్నాళ్లు ఇలానే కొనసాగితే.. హార్ధిగ్​ బోలింగ్ చేయడం మరిచిపోతాడని (Kapil dev comments on Pandya) అభిప్రాయపడ్డాడు.


అయితే టీమ్ ఇండియాకు హార్ధిక్ పాండ్యా కీలకమైన బ్యాటర్ అని స్పష్టం చేశాడు కపిల్ దేవ్​. కానీ మునుపటిలా బౌలింగ్ చేయాలి అంటే మాత్రం అతడికి చాలా ప్రాక్టిస్ అవసరమని పేర్కొన్నాడు.


ఇదే విషయంపై చర్చ..


గత నెల ఓ కార్యక్రమంలో కపిల్​ దేవ్​తో పాటు హార్ధిక్ పాండ్య కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో ఇద్దరు మధ్య ఇదే విషయంపై ఆసక్తికర చర్చ కూడా జరిగింది.


నువ్వు ఆల్​రౌండర్ ఎలా అయ్యావని.. కపిల్ దేవ్​ హార్ధిక్ పాండ్యాను అడగ్గా.. దానికి హార్ధిక్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.


తాను నిజానికి బ్యాటర్ అని.. అయితే అండర్​-19 మ్యాచుల్లో బౌలర్లకు భారం తగ్గించేందుకు అప్పుడప్పుడు బౌలింగ్ చేసే వాడినని చెప్పుకొచ్చాడు. అది చూసి తన కోచ్ బౌలింగ్​లో కూడా ప్రోత్సహించినట్లు వివరించాడు.


ఆకట్టుకోని పాండ్యా..


గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన తర్వాత హార్ధిక్ పాండ్యా ఆశించిన స్థాయిలో (Pandya in T20 world cup 2021) రాణించలేదు. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్ కప్​లోఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం బ్యాటింగ్​కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ కారణంగానే న్యూజిలాండ్ సిరీస్​కు దూరం (IND vs NZ) కూడా అయ్యాడు.


Also read: మ్యాచ్‌ ఆరంభానికి ముందు భారీ భూకంపం.. భయాందోళనకు గురైన క్రికెటర్లు! ఎక్కడో తెలుసా?


Also read: IND VS NZ 1st Test: సెంచరీతో చెలరేగిన శ్రేయస్..టీమిండియా 345 పరుగులకు ఆలౌట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook