Pujara-Shami: చతేశ్వర్ పుజారాను డకౌట్ చేసి.. సంబరాలు చేసుకున్న మహ్మద్ షమీ!
Mohammed Shami Celebrations goes viral after Cheteshwar Pujara Duck. లీస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన మహ్మద్ షమీ.. భారత టెస్ట్ స్పెసలిస్ట్ చతేశ్వర్ పుజారాను డకౌట్ చేశాడు.
Shami Celebrations goes viral after Pujara Duck: ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో భాగంగా లీస్టర్‌షైర్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. లీస్టర్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించిన టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ.. కౌంటీల్లో వరుస సెంచరీలో దుమ్మురేపిన భారత టెస్ట్ స్పెసలిస్ట్ చతేశ్వర్ పుజారాను డకౌట్ చేశాడు. షమీ వేసిన గుడ్‌లెంగ్త్ డెలివరీకి పుజారా క్లీన్ బోల్డ్ అయ్యాడు. 9వ ఓవర్ రెండో బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వికెట్లను గిరాటేసింది.
చతేశ్వర్ పుజారా ఔటయ్యాక మహ్మద్ షమీ భలేగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఔట్ అయిన పుజారా బ్యాట్ పట్టుకుని పెవిలియన్ వైపు వెళ్లిపోతుంటే.. షమీ పరిగెత్తుకుంటూ వెళ్లి అతని పైకి ఎక్కి సెలబ్రేషన్ చేసుకున్నాడు. పుజారా మాత్రం తనకేమీ పట్టనట్టు మౌనంగా డ్రెస్సింగ్ రూం వైపు వెళ్లిపోయాడు. మొత్తానికి షమీ చేసుకున్న సెలబ్రేషన్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై ఫాన్స్ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. 'షమీ నువ్ సూపర్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'కాస్త ఓవర్ అయిందేమో' అని ఇంకొకరు కామెంట్ చేశారు.
తొలి రోజును 246/8తో ముగించిన భారత జట్టు లీస్టర్‌షైర్‌లోని మిగతా టీమిండియా ఆటగాళ్లకు ప్రాక్టీస్ అవకాశం ఇవ్వడం ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. వికెట్ కీపర్ శ్రీకర్ భారత్ 70 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఉదయం సెషన్‌లో లీస్టర్‌షైర్ ఓపెనర్ సామ్ ఇవన్స్, చతేశ్వర్ పుజారాలు త్వరగానే ఔట్ అయ్యారు. మరో ఓపెనర్ లుయిస్ కింబర్ (31), జోయ్ ఎవిసన్ (22), రిషబ్ పంత్ (76) ఇన్నింగ్స్‌ను నడిపించారు. లీస్టర్‌షైర్ 244 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. భరత్, గిల్ క్రీజుల్ ఉన్నారు. భారత్ 61 పరుగుల ఆధిక్యంలో ఉంది.
Also Read: Priyanka Jawalkar Pics: ప్రియాంక జవాల్కర్ క్లీవేజ్ షో.. నెక్ట్స్ లెవల్ అందాలతో..!
Also Read: Vaani Kapoor Pics: బ్లాక్ డ్రెస్‌లో వాణీ కపూర్.. బిగుతైన ఎద అందాలు చూపిస్తూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.