Virat Kohli teaching a lesson to Fan: ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ప్రస్తుతం లీసెస్టర్‌షైర్‌తో నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ 79 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా (18), శ్రేయాస్ అయ్యర్ (41) ఉన్నారు. ప్రస్తుతం భారత్ 300 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 67 పరుగులు చేశాడు. లీసెస్టర్‌షైర్‌ బౌలర్ నవదీప్ సైనీ మూడు వికెట్లు పడగొట్టాడు. మరో రోజు మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచులో కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆట మూడో రోజైన శనివారం లీసెస్టర్ షైర్ తరఫున కమలేష్ నాగర్‌కోటి బౌలింగ్ చేశాడు. అనంతరం ఫీల్డింగ్ చేసేందుకు బౌండరీ లైన్ వద్దకు వెళ్ళాడు. అక్కడ ఓ అభిమాని నాగర్‌కోటిని విసిగించాడు. కమలేష్ ఒక్క సెల్ఫీ ప్లీజ్.. ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటూ పదేపదే అరిచాడు. నీకోసమే మ్యాచ్ చూడడానికి ఇక్కడికి వచ్చాను అంటూ టీజ్ చేశాడు. ఈ తతంగాన్ని డ్రెస్సింగ్ రూంలో నుంచి విరాట్ కోహ్లీ గమనించాడు. వెంటనే బాల్కనీలోకి వచ్చి సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాడిన ఎందుకలా ఇరిటేట్ చేస్తావ్ అంటూ ప్రశ్నించాడు.



ఆపై అభిమాని కూడా విరాట్ కోహ్లీతో వాదించాడు. 'కమలేష్ నాగర్‌కోటితో ఒక ఫోటో దిగాలనుకుంటున్నా. ఈ మ్యాచ్ చూడడానికి నేను ఆఫీసుకు సెలవు పెట్టా. అతడు నాతో ఒక్క సెల్ఫీ దిగితే ఏం పోతుంది. నేను అతన్ని రిక్వెస్ట్ చేస్తున్నా' అని కోహ్లీతో అన్నాడు. దాంతో కోహ్లీకి చిరువోత్తుకొచ్చింది. 'అతను మ్యాచ్ ఆడటానికి వచ్చాడా? లేదా నీతో ఫోటోలు దిగడానికి వచ్చాడా?' కోహ్లీ అనడంతో సదరు అభిమాని వెనక్కి తగ్గాడు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాన్స్ అందరూ ఆ అభిమానిపై మండిపడుతున్నారు. 


Also Read: ఇది కదా తల్లి ప్రేమ అంటే.. నీటిలో కొట్టుకుపోతున్న బిడ్డను కాపాడుకున్న తల్లి ఏనుగు!


Also Read: ND vs IRE Records: ఐర్లాండ్‌ vs భారత్ టీ20 రికార్డులు ఇవే.. అత్యధిక రన్స్, వికెట్స్ వీరులు వీరే!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.