వీవీఎస్‌ లక్ష్మణ్‌.. ఇది యావత్‌ భారతదేశానికి పరిచయం అక్కరలేని పేరు... అచ్చమైన తెలుగింటి క్రికిట్‌ ఆటగాడిగా అంతార్జాతీయ ఖ్యాతి గాంచినాడు. లక్ష్మణ్ పూర్తిపేరు వంగివరపు వెంకట సాయి లక్ష్మణ్ . వీవీఎస్ 1974 నవంబర్ 1న  హైదరాబాద్ లో జన్మించాడు. వీవీఎస్ టీమిండియ తరఫున 126 టెస్టు, 86 వన్డే మ్యాచ్ లకు ప్రాతినిత్యం వహించాడు. టెస్టులలో 16 శతకాలు, వన్డేలలో 6 శతకాలు సాధించాడు. టెస్టులలో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 281 పరుగులు. కాగా ఈ వ్యవధిలో వీవీఎస్ టీమిండియాకు అనేక విజయాలను అందించాడు. కళాత్మక షాట్లతో ప్రేక్షకులకు కనువిందు చేసే తీరు అద్భుతం.  క్రికెట్ పుస్తకం రాసిన ప్రతిషాట్ ను చూడాలంటే వీవీఎస్ లక్ష్మణ్ ఆటను చూస్తే సరిపోతోందని పలు క్రీడా విశ్లేషకులు చెబుతుంటారు. వీవీఎస్ ఆసీస్ సిరీస్ అంటేనే చాలు పరుగుల సునామీ సృష్టించేవాడు. లక్ష్మణ్ ను కట్టడి చేస్తే చాలు తాము గెలిచినట్లు ఆసీస్ భావించేదంటే అతని ఏ పాటిలో ఆడేవాడో అర్ధం చేసుకోవచ్చు. అందుకే వీవీఎస్ అంటే వెరి వెరి స్పెషల్ గాను సంభోధిస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కెరీర్...ఒడిదుడుకులు..


చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటేనే తన ప్రాణంగా జీవించిన వీవీఎస్..1996లో అహ్మదాబాద్ లో  సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో అరంగ్రేటం చేశాడు. తన తొలి మ్యాచ్ లో యాభై పరుగులు చేసి అరంగ్రేటంలోనే తానేంటో నిరూపించుకున్నాడు. కానీ తర్వాతి కాలంలో లక్ష్మణ్ భారత అంతర్జాతీయ జట్టులో స్థానం నిలుపుకోలేకపోయాడు. సరిగ్గా ఏడాది తర్వాత  1997 సంవత్సరంలో దకిణాప్రికాతో ఓపెనింగ్ చేయడానికి పంపబడ్డాడు, కాని మళ్లీ అక్కడ విఫలం అయ్యాడు. ఇలా మూడు సంవత్సరాలు అంతర్జాతీయ క్రికెట్టులో స్థానం స్థిరంగా నిలుపుకోలేకపోయాడు. తన వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకున్న వీవీఎస్  2000 జనవరి భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన సీరిస్ లో ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో 167 పరుగులు చేసి తన సత్తా చూపాడు. ఇక అప్పటి నుంచి వీవీఎస్ వెనదిరగలేదు. టెస్టుల్లో స్థిరంగా రాణిస్తూ తాను ఎంతటి విలువైన ఆటగాడో ప్రపంచానికి తెలియజేశాడు. ఇలా పడిలేస్తూ సాగిన వీవీఎస్ పయనం ..2012 ఆగస్టు 18తో ముగిసింది. వీవీఎస్ టీమిండియాకు చేసిన సేవలను గుర్తించి 2011 లో  పద్మ శ్రీ పురస్కారం తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.