CSK vs RCB IPL 2024 Live Updates: చెపాక్‌లో కుమ్మేసిన చెన్నై.. ఆర్‌సీబీపై గెలుపు సవారీ
Chennai Super Kings vs Royal Challengers Bangalore Live Score Updates: ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెన్నై, ఆర్‌సీబీ జట్లు తొలి మ్యాచ్‌లో ఢీకొంటున్నాయి. ఐపీఎల్ లైవ్ స్కోర్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Chennai Super Kings vs Royal Challengers Bangalore Live Score Updates: సిక్సర్లు, ఫోర్ల సందడితో హోరెత్తించేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో చెన్నై బరిలోకి దిగుతుండగా.. ఈసారై టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఆర్‌సీబీ సిద్ధమవుతోంది. ఇటీవల ఆర్‌సీబీ వుమెన్స్ టీమ్ డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా నిలవడంతో.. డుప్లెసిస్ సేన కూడా అదే స్పూర్తితో టైటిల్‌పై కన్నేసింది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 31 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెన్నై 20 మ్యాచ్‌ల్లో, ఆర్‌సీబీ 10 మ్యాచ్‌ల్లో విజయంసాధించాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మ్యాచ్ లైవ్ స్కోర్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
CSK Vs RCB Live Score Updates: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆర్‌సీబీని 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. బెంగళూరు విధించిన 174 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించింది. శివమ్ ధుబే (34), రవీంద్ర జడేజా (25) చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించారు.
CSK Vs RCB Live Score Updates: చెన్నై విజయానికి మరింత చేరువైంది. 18వ ఓవర్‌లో ధుబే రెండు బౌండరీలు బాదడంతో 8 పరుగులు వచ్చాయి. 12 బంతుల్లో 10 పరగులు చేయాల్సి ఉంది.
CSK Vs RCB Live Score Updates: 17వ ఓవర్‌లో చెన్నై 16 పరుగులు పిండుకుంది. దీంతో స్కోరు బోర్డు 156 పరుగులకు చేరుకుంది.
CSK Vs RCB Live Score Updates: మ్యాచ్ సాగుతున్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. చెన్నై విజయానికి 4 ఓవర్లలో 34 పరుగులు అవసరం కాగా.. ఆర్‌సీబీ బౌలర్లు పోరాడుతున్నారు. స్కోరు: 140/4 (16).
CSK Vs RCB Live Score Updates: 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. క్రీజ్‌లో జడేజా (16), ధుబే (7) ఉన్నారు. 30 బంతుల్లో 46 పరుగులు చేస్తే చెన్నై విజయం సాధిస్తుంది.
CSK Vs RCB Live Score Updates: చెన్నై లక్ష్యంవైపు దూసుకుపోతుంది. 14వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ 7 పరుగులు ఇచ్చాడు. చెన్నై విజయానికి 36 బంతుల్లో 53 పరుగులు కావాలి.
CSK Vs RCB Live Score Updates: కామెరున్ గ్రీన్ మరోసారి చెన్నైను దెబ్బ తీశాడు. డారిల్ మిచెల్ (22)ను పెవిలియన్‌కు పంపించాడు. స్కోరు: 114/4 (13).
CSK Vs RCB Live Score Updates: 12వ ఓవర్‌లో జోసఫ్ 7 పరుగులు ఇచ్చాడు. మిచెల్ (22), ధుబే (5) క్రీజ్‌లో ఉన్నారు.
CSK Vs RCB Live Score Updates: చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. గ్రీన్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన రహానే.. తరువాతి బంతికి భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు. బౌండరీ లైన్ వద్ద మ్యాక్స్‌వెల్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. చెన్నై స్కోరు 11 ఓవర్లలో 102/3.
CSK Vs RCB Live Score Updates: మయాంక్ దగార్ మరోసారి కట్టడిగా బౌలింగ్ చేశాడు. 10వ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చాడు. చెన్నై స్కోరు: 92/2 (10).
CSK Vs RCB Live Score Updates: 9వ ఓవర్‌లో డారిల్ మిచెల్ బ్యాట్ ఝులిపించాడు. వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 15 పరుగులు రావడంతో చెన్నై స్కోరు 88 పరుగులకు చేరుకుంది.
CSK Vs RCB Live Score Updates: 8వ ఓవర్‌లో మాయంక్ దగార్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. స్కోరు 73/2 (8).
CSK Vs RCB Live Score Updates: రచిన్ రవీంద్రను కర్ణ్ శర్మ పెవిలియన్‌కు పంపించాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులతో జోరు మీదున్న రచిన్.. భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద పటీదార్‌కు దొరికిపోయాడు. చెన్నై స్కోరు: 71-2 (7)
CSK Vs RCB Live Score Updates: పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై ఒక వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. రచిన్ (31), రహనే (14) ఆడుతున్నారు.
CSK Vs RCB Live Score Updates: అల్జరీ జోసఫ్‌కు సిక్సర్‌తో స్వాగతం పలికాడు రచిన్ రవీంద్ర. ఐదో ఓవర్‌లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. రచిన్‌కు తోడు రహనే క్రీజ్‌లో ఉన్నాడు.
CSK Vs RCB Live Score Updates: చెన్నైను యష్ ధయాల్ తొలి దెబ్బ తీశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (15)ను పెవిలియన్ బాట పట్టించాడు. స్లిప్‌లో గ్రీన్ క్యాచ్ అందుకున్నాడు. నాలుగు ఓవర్లకు 38-1.
CSK Vs RCB Live Score Updates: చెన్నై ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో రచిన్ ఒక ఫోర్, సిక్సర్ బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. స్కోరు: 28/0 (3)
CSK Vs RCB Live Score Updates: చెన్నై ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. సిరాజ్ వేసిన మూడో ఓవర్‌లో రచిన్ ఒక ఫోర్, సిక్సర్ బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 16 పరుగులు వచ్చాయి. స్కోరు: 28/0 (3)
CSK Vs RCB Live Score Updates: రచిన్ రవీంద్రకు అదృష్టం కలిసొచ్చింది. ఐపీఎల్‌లో తాను ఎదుర్కొన్న బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. అదృష్టవశాత్తూ బౌండరీకి వెళ్లిపోయింది. యష్ ధయాల్ వేసిన ఈ ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి
CSK Vs RCB Live Score Updates: బౌండరీతో ఇన్నింగ్స్ ఆరంభించాడు రుతురాజ్. ఐదో బంతికి మరో ఫోర్ కొట్టడంతో 8 పరుగులు వచ్చాయి. సిరాజ్ తొలి ఓవర్‌లో పరుగులు ఇచ్చాడు.
CSK Vs RCB Live Score Updates: కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు తోడు రచిన్ రవీంద్ర ఓపెనర్‌గా క్రీజ్‌లోకి వచ్చాడు. ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. 2009 తరువాత చెపాక్‌లో విజయాన్ని నమోదు చేసుకుంటుంది.
CSK Vs RCB Live Score Updates: ఇన్నింగ్స్ చివరి బాల్‌కు అనుజ్ రావత్‌ను ఎంఎస్ ధోని రనౌట్ చేశాడు. దినేష్ కార్తీక్‌తో కలిసి ఆరో వికెట్‌కు రావత్ 50 బంతుల్లో 95 పరుగులు జోడించాడు. 78 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరు ఆదుకున్నారు. 174 పరుగుల లక్ష్యంతో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది.
CSK Vs RCB Live Score Updates: ఆర్‌సీబీని దినేష్ కార్తీక్ (38 నాటౌట్), అనుజ్ రావత్ (48) గట్టెక్కించారు. 20 ఓవర్లలో బెంగుళూరు ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది.
CSK Vs RCB Live Score Updates: దినేష్ కార్తీక్, రావత్ దుమ్ములేపుతున్నారు. ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్‌లో 16 పరుగులు రాబట్టారు. స్కోరు: 164/5 (19).
CSK Vs RCB Live Score Updates: తుషార్ పాండే వేసిన 18వ ఓవర్‌లో దినేష్ కార్తీక్, రావత్ వీరవిహారం చేశారు. కార్తీక్ ఒక సిక్సర్ బాదగా.. రావత్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. ఈ ఓవర్లో మొత్తం 25 పరుగులు వచ్చాయి. స్కోరు: 148/5 (18).
CSK Vs RCB Live Score Updates: అనుజ్ రావత్ (25), దినేష్ కార్తీక్ (19) నిలకడగా ఆడుతూ.. ఇన్నింగ్స్ చక్క దిద్దుతున్నారు. ప్రస్తుతం ఆర్‌సీబీ 17 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.
CSK Vs RCB Live Score Updates: 16వ ఓవర్‌లో దినేష్ కార్తీక్ గేర్ మార్చాడు. ఒక ఫోర్, సిక్సర్ బాదడంతో మొత్తం 14 పరుగులు వచ్చాయి. స్కోరు: 116/5 (16).
CSK Vs RCB Live Score Updates: 15వ ఓవర్‌లో రావత్ రెండు బౌండరీలు బాదాడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది.. 15 ఓవర్లలో ఆర్‌సీబీ ఐదు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది.
CSK Vs RCB Live Score Updates: విరాట్ కోహ్లీ సూపర్ క్యాచ్ ఇలా పట్టేశారు.
CSK Vs RCB Live Score Updates: ఆర్‌సీబీ బ్యాట్స్‌మెన్ పోరాడుతున్నారు. 14 ఓవర్లు ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది.
CSK Vs RCB Live Score Update: 13వ ఓవర్‌లో తుషార్ దేశ్‌పాండే కేవలం నాలుగు పరుగులే ఇచ్చాడు. దినేష్ కార్తీక్, రావత్ క్రీజ్‌లో ఉన్నారు.
CSK Vs RCB Live Score Update: ముస్తాఫిజుర్ మరోసారి ఆర్‌సీబీకి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఒకే ఓవర్‌లో విరాట్ కోహ్లీ (21), కామెరున్ గ్రీన్ (18)ను ఔట్ చేశాడు. దీంతో ఆర్‌సీబీ సగం జట్టు పెవిలియన్‌కు చేరిపోయింది. ముస్తాఫిజుర్ ఖాతాలో నాలుగు వికెట్లు చేరాయి. స్కోరు: 79/5 (12).
CSK Vs RCB Live Score Update: 11వ ఓవర్‌లో రవీంద్ర జడేజా కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. స్కోరు 76/3 (11).
CSK Vs RCB Live Score Update: పదో ఓవర్‌లో గ్రీన్ ఒక సిక్సర్ బాదాడు. తీక్షణ వేసిన ఈ ఓవర్లో మొత్తం 12 పరుగులు వచ్చాయి. కోహ్లీ (21), కామెరూన్ గ్రీన్ (16) క్రీజ్‌లో ఉన్నారు.
CSK Vs RCB Live Score Update: తొమ్మిది ఓవర్లు ముగిసే సరికి ఆర్‌సీబీ మూడు వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది.
CSK Vs RCB Live Score Update: ఆర్‌సీబీ స్కోరు వేగం కాస్త తగ్గింది. కోహ్లీ, కామెరున్ గ్రీన్ ఆచితూచి ఆడుతున్నారు. స్కోరు: 55/3 (8).
CSK Vs RCB Live Score Updates: ఏడు ఓవర్లు ముగిసే సరికి ఆర్‌సీబీ మూడు వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది.
CSK Vs RCB Live Score Updates: చెన్నై సూపర్ కింగ్స్ కోలుకుంది. మూడు వికెట్లు కోల్పోయి ఆర్‌సీబీ కష్టాల్లో పడింది. స్కోరు: 42/3 (6)
CSK Vs RCB Live Score Updates: ఆర్‌సీబీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. గ్లెన మ్యాక్స్‌వెల్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.
CSK Vs RCB Live Score Updates: ఐదో ఓవర్‌లో ఆర్‌సీబీకి భారీ షాక్ తగిలింది. బౌండరీల వర్షం కురిపించిన డుప్లెసిస్ (35)ను ముస్తాఫిజుర్ ఔట్ చేశాడు. రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్ పట్టాడు. రజత్ పటిదార్ (0)ను కూడా ముస్తాఫీజుర్ ఔట్ చేశాడు. క్రీజ్‌లోకి వచ్చాడు. ఆర్‌సీబీ స్కోరు: 41/2 (5)
CSK Vs RCB Live Score Updates: నాలుగు ఓవర్లలో ఆర్‌సీబీ 36 పరుగులు చేసింది. డుప్లెసిస్ (31), విరాట్ కోహ్లీ (3) క్రీజ్‌లో ఉన్నారు.
CSK Vs RCB Live Score Updates: మూడో ఓవర్‌లో డుప్లెసిస్ దుమ్ములేపాడు. దీపక్ చాహర్ వేసిన ఈ ఓవర్‌లో ఏకంగా నాలుగు ఫోర్లు బాదాడు. స్కోరు: 33/0.
CSK Vs RCB Live Score Updates: రెండో ఓవర్‌లో డుప్లెసిస్ రెండు బౌండరీలు బాది ఒక సింగిల్ తీశాడు. దీంతో ఈ ఓవర్లో మొత్తం 9 పరగులు వచ్చాయి.
CSK Vs RCB Live Score Updates: ఓపెనర్లుగా విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ వచ్చారు. మొదటి బాల్‌ను సీఎస్‌కే పేసర్ దీపక్ చాహర్ వైడ్‌గా వేశాడు. డుప్లెసిస్ ఒక ఫోర్ కొట్టడంతో మొత్తం 7 పరుగులు వచ్చాయి.
CSK Vs RCB Toss Updates and Playing 11: "మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. మంచి వికెట్ కనిపిస్తోంది. చెన్నై అభిమానులను మళ్లీ చూడటం చాలా ఆనందంగా ఉంది. ప్రిపరేషన్ బాగా జరిగింది. కొత్త కోచ్ ఆండీ ఫ్లవర్ అనుభవం ఎంతో ఉపయోగడనుంది. మా బౌలింగ్ విభాగం సరిపోయింది. మరింత బ్యాకప్ వచ్చింది. అల్జారీ జోసెఫ్ ఈ మ్యాచ్‌లో ఆడనున్నాడు. మేం మొదట బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి" అని ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ తెలిపాడు.
CSK Vs RCB Toss Updates and Playing 11: కెప్టెన్సీ గురించి తనకు గత వారమే తెలిసిందని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. మహీ భాయ్ గతేడాది హింట్ ఇచ్చాడని చెప్పాడు. టీమ్‌లో అందరూ అనుభవజ్ఞులే ఉన్నారని.. దురదృష్టవశాత్తు కాన్వే, పతిరణాను మిస్ అయ్యామన్నాడు. రచిన్ రవీంద్ర, మిచెల్ జట్టులోకి రావడంతో సరిపోయిందన్నాడు. మిస్టరీ స్పిన్నర్ సమీర్ రిజ్వీ అరంగేట్రం చేస్తున్నాడని వెల్లడించాడు.
CSK Vs RCB Toss Updates and Playing 11: చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, మహేశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాప్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అనుజ్ రావత్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్.
CSK Vs RCB Toss Updates: ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో సీఎస్‌కే మొదట బౌలింగ్ చేయనుంది.
CSK Vs RCB Toss Updates: చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు మరికాసేపట్లో ప్రారంభంకానుంది. భారీ ఎత్తున జరిగిన ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు ఘనంగా ముగిశాయి.
CSK Vs RCB Live Updates: మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ వేదికపైకి వచ్చారు. గాయకుడు సోనూ నిగమ్‌తో కలిసి వందేమాతరం పాటతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ మన జాతీయ జెండాతో మైదానం మొత్తం రౌండ్ వేశారు.
CSK vs RCB IPL 2024 Live Updates: అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ జాతీయ జెండాను ఊపుతూ వందనం చేస్తూ బయటకు వచ్చారు. JioCinema యాప్, వెబ్‌సైట్‌లో క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ను ఫ్రీగా చూడవచ్చు.
CSK vs RCB IPL 2024 Live Updates: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఎంఏ చిదంబరం స్టేడియంలో భారీగా ప్రేక్షకులు హాజరయ్యారు.
CSK vs RCB IPL 2024 Live Updates: బెంగళూరు ఆటగాళ్లు స్టేడియానికి చేరుకున్నారు..
CSK vs RCB Dream11 Team Tips:
వికెట్ కీపర్: ఎంఎస్ ధోని
బ్యాటర్లు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ (వైస్ కెప్టెన్), రచిన్ రవీంద్ర, ఫాప్ డుప్లెసిస్
ఆల్ రౌండర్లు: గ్లెన్ మాక్స్‌వెల్, రవీంద్ర జడేజా, కామెరూన్ గ్రీన్
బౌలర్లు: మహేశ్ తీక్షణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.
CSK Vs RCB Live Streaming: స్ట్రీమింగ్ ఎక్కడ..?
మ్యాచ్: చెన్నై సూపర్ కింగ్స్ VS రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఎప్పుడు: శుక్రవారం రాత్రి 7:30 గంటలకు.
వేదిక: ఎంఏ చిదంబరం స్టేడియం, బెంగళూరు
స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి: JioCinema యాప్CSK Vs RCB Live Updates: ఐపీఎల్‌లో కొన్ని రికార్డులు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. ఇప్పట్లో బ్రేక్ కావడానికి అవకాశం లేని రికార్డులు ఏంటో ఓసారి తెలుసుకుందాం. వీటిని బద్దలుకొట్టడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఆ రికార్డుల ఏవో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..
CSK Vs RCB Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 5 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు ఎంఎస్ ధోని కేవలం 43 పరుగుల దూరంలో ఉన్నాడు. సురైష్ రైనా తరువాత సీఎస్‌కే బ్యాటర్లలో 5 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలవనున్నాడు.