IND Vs NZ Live Score: ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత్.. కివీస్ చిత్తు
India Vs New Zealand Live Score Updates: టీమిండియా, కివీస్ జట్ల మధ్య సెమీస్‌కు పోరు మరికాసేపట్లో ఆరంభంకానుంది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు టీవీలకు ఆతుక్కుపోనున్నారు. అభిమానులతో ముంబై వాంఖేడే స్టేడియం కిక్కిరిసిపోనుంది. ఈ మ్యాచ్ లైవ్ స్కోరు అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
India Vs New Zealand Live Score Updates: అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తొలి సెమీ ఫైనల్ పోరుకు భారత్, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌లు నెగ్గి సెమీస్‌కు చేరిన టీమిండియా.. అదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. మరోసారి భారత్‌ను సెమీస్‌లో ఓడించి ఫైనల్‌కు చేరుకోవాలని న్యూజిలాండ్ భావిస్తోంది. 2019 సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్.. ఒక్కసారైనా ప్రపంచకప్ గెలవాలని కివీస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుని బరిలో దిగుతున్నాయి. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్‌లో దుమ్మురేపుతుండగా.. కివీస్ బ్యాటింగ్‌లో మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా ఉంది. తొలి సెమీఫైనల్‌లో టాస్ చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ముంబైలోని వాంఖేడే స్టేడియ వేదికగా బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు టాస్ జరుగుతుంది. లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
IND Vs NZ Live Score: 2019 సెమీస్‌లో ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై అద్భుత విజయం సొంతం చేసుకుంది. రేపు దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య గెలిచిన టీమ్‌తో నవంబర్ 19న ఫైనల్‌లో తలపడనుంది.
IND Vs NZ Live Score: టీమిండియా ఫైనల్లోకి దూసుకువెళ్లింది. కివీస్‌పై 70 పరుగులతో జయకేతనం ఎగురవేసింది. షమీ 7 వికెట్లతో న్యూజిలాండ్ భరతం పట్టాడు. దీంతో 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌట్ అయింది.
IND Vs NZ Live Score: భారత్ విజయం ఖాయమైపోయింది. 319 పరుగుల వద్ద 8వ వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం స్కోరు 320/8 (48). విజయానికి ఇంకా 12 బంతుల్లో 78 పరుగులు చేయాల్సి ఉంది.
IND Vs NZ Live Score: బుమ్రా వేసిన 47 ఓవర్‌లో 5 పరుగులు వచ్చాయి. కివీస్ గెలవాలంటే.. 18 బంతుల్లో 85 రన్స్ చేయాలి.
IND Vs NZ Live Score: కివీస్ విజయానికి 24 బంతుల్లో 90 పరుగులు చేయాల్సి ఉంది. 46 ఓవర్‌లో షమీ కేవలం 2 పరుగులు ఇచ్చి డారిల్ మిచెల్‌ను ఔట్ చేశాడు.
IND Vs NZ Live Score: న్యూజిలాండ్ ఓటమి ఖాయమైంది. సూపర్ సెంచరీతో ఆకట్టుకున్న డారిల్ మిచెల్ (134)ను షమీ పెవిలియన్‌కు పంపించాడు. షమీకి ఇది ఐదో వికెట్. ఈ వరల్డ్ కప్‌లో ఐదు వికెట్లు తీయడం మూడోసారి కావడం విశేషం.
IND Vs NZ Live Score: 45 ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. న్యూజిలాండ్ లక్ష్యం 30 బంతుల్లో 92 పరుగులుగా ఉంది. స్కోరు: 306-6 (45).
IND Vs NZ Live Score: కివీస్‌ను కుల్దీప్ యాదవ్ దెబ్బ తీశాడు. 44వ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు ఇచ్చి.. చాప్‌మన్ (2) వికెట్ తీశాడు. కివీస్ విజయం సాధించాలంటే.. 36 బంతుల్లో 99 పరుగులు చేయాల్సి ఉంది.
IND Vs NZ Live Score: న్యూజిలాండ్ ఐదో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి గ్లెన్ ఫిలిప్స్ (41) ఔట్ అయ్యాడు. బౌండరీ లైన్ వద్ద జడేజా చక్కటి క్యాచ్ అందుకున్నాడు. స్కోరు: 295-5 (43).
IND Vs NZ Live Score: 42 ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. విజయానికి 48 బంతల్లో 110 పరుగులు చేయాల్సి ఉంది.
IND Vs NZ Live Score: 41 ఓవర్‌లో కివీస్ వీరవిహారం చేసింది. సిరాజ్ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా 1 Wd 6 6 Wd 4 0 1 పరుగులు వచ్చాయి. మొత్తం 20 పరుగులు పిండుకున్నారు.
IND Vs NZ Live Score: 40 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లనష్టానికి 266 పరుగులు చేసింది. 60 బంతుల్లో 132 రన్స్ చేయాల్సి ఉంది.
IND Vs NZ Live Score: 39 ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌లో రెండు బౌండరీలు బాదారు. స్కోరు 257-4 (39).
IND Vs NZ Live Score: టీమిండియా పట్టుబిగిస్తోంది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. కివీస్ విజయానికి ఇంకా 78 బంతుల్లో 162 పరుగులు చేయాల్సి ఉంది. స్కోరు 37 ఓవర్లలో 236/4.
IND Vs NZ Live Score: ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోవడంతో న్యూజిలాండ్ స్కోరు నెమ్మదించింది. మిచెల్ డారిల్ (103), గ్లెన్ ఫిలిప్స్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం స్కోరు 35 ఓవర్లలో 224/4.
IND Vs NZ Live Score: న్యూజిలాండ్ మరో వికెట్ కోల్పోయింది. టామ్ లాథమ్‌ను షమీ డకౌట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అభిమానులు ఉత్సాహంతో కేకలు వేస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 17 ఓవర్లలో 178 పరుగులు చేయాల్సి ఉంది.
IND Vs NZ Live Score: మహ్మద్ షమీ మరో బ్రేక్ అందించాడు. క్రీజ్‌లో పాతుకుపోయిన కేన్ విలియమ్సన్ (69)ను పెవిలియన్‌కు పంపించాడు. భారీ షాట్‌కు యత్నించిన కేన్ మామ.. బౌండరీ లైన్ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన చక్కటి క్యాచ్‌తో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. షమీకి ఇది వరల్డ్ కప్‌లో 50వ వికెట్ కావడం విశేషం.
IND Vs NZ Live Score: డారిలో మిచెల్ 85 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో భారత్‌పై వరుసగా రెండో శతకం బాదడం విశేషం. 8 ఫోర్లు, 5 సిక్సర్లు బాదడం విశేషం.
IND Vs NZ Live Score: ఫీల్డింగ్‌లో టీమిండియా చేసిన తప్పిదాలను విలియ్సన్ (65), డారిల్ మిచెల్ (99) సద్వినియోగం చేసుకుని దూకుడుగా ఆడుతున్నారు. ప్రస్తుతం స్కోరు 32 ఓవర్లలో 219/2.
IND Vs NZ Live Score: 31 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. విజయానికి మరో 185 పరుగులు చేయాల్సి ఉంది.
IND Vs NZ Live Score: న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 58 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. విలియమ్సన్‌కు తోడు మిచెల్ (64 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. స్కోరు 26 ఓవర్లలో 165/2.
IND Vs NZ Live Score: డారిల్ మిచెల్ (51 నాటౌట్) వరల్డ్ కప్‌లో మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 23 ఓవర్లు ముగిసేసరికి కివీస్ రెండు వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది.
IND Vs NZ Live Score: కివీస్ గేర్ మార్చి స్పీడ్ పెంచేందుకు ప్రయత్నిస్తోంది. 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.
IND Vs NZ Live Score: భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జోరు పెంచారు. ప్రస్తుతం స్కోరు 18 ఓవర్లలో 114/2. క్రీజ్‌లో విలియమ్సన్ (30), మిచెల్ (33) ఉన్నారు.
IND Vs NZ Live Score: మరో వికెట్ పడగొట్టేందుకు టీమిండియా బౌలర్లు కాస్త శ్రమిస్తున్నారు. విలియమ్సన్, మిచెల్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. మెల్లిగా స్కోరుబోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. స్కోరు 15 ఓవర్లలో 87/2.
IND Vs NZ Live Score: న్యూజిలాండ్ జాగ్రత్తగా ఆడుతోంది. మరో వికెట్ పడితే కోలుకునే అవకాశం లేకపోవడంతో విలియమ్సన్ (6), మిచెల్ (14) నెమ్మదిగా ఆడుతున్నారు. ప్రస్తుతం స్కోరు 12 ఓవర్లు 62/2.
IND Vs NZ Live Score: పది ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 40 ఓవర్లలో 352 పరుగులు చేయాల్సి ఉంది.
IND Vs NZ Live Score: న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఓపెనర్లు ఇద్దరు ఔట్ అవ్వడంతో ఆచితూచి ఆడుతోంది. 9వ ఓవర్‌ను బుమ్రా మెడిన్ వేశాడు. ప్రస్తుతం క్రీజ్‌లో కేన్ విలియమ్సన్ (4), మిచెల్ (0) ఉన్నారు. స్కోరు 9 ఓవర్లకు 40-2.
IND Vs NZ Live Score: కివీస్‌కు భారీ షాక్ తగిలింది. సూపర్ ఫామ్‌లో ఉన్న రచిన్ రవీంద్ర (13)ను షమీ ఔట్ చేశాడు. కేఎల్ రాహుల్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు.
IND Vs NZ Live Score: ఏడో ఓవర్‌ను బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. ప్రస్తుతం స్కోరు 7 ఓవర్లు 35-1.
IND Vs NZ Live Score: న్యూజిలాండ్‌కు మహ్మద్ షమీ తొలి దెబ్బ తీశాడు. తాను వేసిన మొదటి బంతికే కాన్వే (13)ను పెవిలియన్‌కు పంపించాడు.
IND Vs NZ Live Score: కివీస్ ఓపెనర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఐదు ఓవర్లలో 30 పరుగులు చేశారు. ఐదో ఓవర్‌లో 7 పరుగులు రాగా.. ఇందులో ఎక్స్‌ట్రాల రూపంలోనే 6 పరుగులు వచ్చాయి.
IND Vs NZ Live Score: తొలి వికెట్ కోసం బుమ్రా, సిరాజ్ శ్రమిస్తున్నారు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి కివీస్ స్కోరు 23-0
IND Vs NZ Live Score: ఓపెనర్లు డేవిడ్ కాన్వే, రచిన్ రవీంద్ర దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం స్కోరు 3 ఓవర్లు 19/0.
IND Vs NZ Live Score: 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది కివీస్. ఓపెనర్ డేవాన్ కాన్వే బూమ్రా బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదాడు. దీంతో ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి.
విరాట్ కోహ్లీని కలిసిన సచిన్ టెండూల్కర్
విరాట్ కోహ్లీ 50వ సెంచరీ సాధించడంపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం
IND Vs NZ Live Score: టీమిండియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (39), శుభ్‌మన్ గిల్ (80) నాటౌట్‌గా క్రీజ్‌లో నిలిచారు.
IND Vs NZ Live Updates: భారత్ మరో వికెట్ కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ (1) భారీ షాట్‌కు యత్నించి ఔట్ అయ్యాడు.
IND Vs NZ Live Score: టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. శ్రేయాస్ అయ్యర్ (106) బౌల్ట్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం స్కోరు 49 ఓవర్లు 382/3.
IND Vs NZ Live Score: భారత్ స్కోరు 400 పరుగులకు చేరువగా దూసుకెళ్తుంది. స్కోరు: 48 ఓవర్లు 366/2.
IND Vs NZ Live Score: సొంతగడ్డపై శ్రేయాస్ అయ్యర్ చెలరేగిపోయాడు. ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో శతకం బాదాడు.
IND Vs NZ Live Score: టీమిండియా స్కోరు 350 పరుగులు దాటింది. క్రీజ్‌లో శ్రేయాస్ అయ్యర్ (93), కేఎల్ రాహుల్ (10) క్రీజ్‌లో ఉన్నారు. స్కోరు: 47 ఓవర్లు 354/2
IND Vs NZ Live Score: శ్రేయాస్ అయ్యర్ (91) సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం స్కోరు 46 ఓవర్లు 347/2.
IND Vs NZ Live Score: విరాట్ కోహ్లీ గ్రేట్ ఇన్నింగ్స్ ముగిసింది. 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి కోహ్లీ.. సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 327 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
IND Vs NZ Live Score: విరాట్ కోహ్లీ (106) రికార్డు సెంచరీకి తోడు శ్రేయాస్ అయ్యర్ (66) దూకుడుతో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం స్కోరు 42 ఓవర్లు 304-1
IND Vs NZ Live Score: విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో వన్డే కెరీర్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా సచిన్ (49) రికార్డును బ్రేక్ చేశాడు.
IND Vs NZ Live Score: టీమిండియా భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది. కోహ్లీ (95), అయ్యర్ (61) క్రీజ్‌లో ఉన్నారు. స్కోరు 40 ఓవర్లు 287/1.
IND Vs NZ Live Score: కింగ్ కోహ్లీ (92) కెరీర్‌లో 50వ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. శ్రేయాస్ అయ్యర్ (53) దూకుడు కొనసాగుతోంది. ప్రస్తుతం స్కోరు 38 ఓవర్లు 275/1.
IND Vs NZ Live Score: శ్రేయాస్ అయ్యర్ మరో సూపర్ ఫిఫ్టీ కొట్టేశాడు. 35 బంతుల్లో 50 మరో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం.
IND Vs NZ Live Score: భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 35 ఓవర్లలో వికెట్ నష్టానికి 248 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (80), శ్రేయాస్ అయ్యర్ (38) దూకుడుగా ఆడుతున్నారు.
IND Vs NZ Live Score: టీమిండియా జోరు కొనసాగుతోంది. విరాట్ కోహ్లీ (70), శ్రేయాస్ అయ్యర్ (21) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం స్కోరు 31 ఓవర్లు 221/1.
IND Vs NZ Live Score: వరల్డ్ కప్‌లో కింగ్ కోహ్లీ సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతోంది. 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 27 ఓవర్లు 194-1
IND Vs NZ Live Score: స్టేడియంలో వేడితో శుభ్‌మన్ గిల్ ఇబ్బందిపడ్డాడు. ఎక్కువగా గాలి లేకపోవడంతో క్రాక్స్‌తో కదల్లేకపోయాడు. దీంతో ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయినా సెట్ అవ్వకపోవడంతో రిటైర్డ్‌హర్ట్‌గా మైదానం వీడిచి వెళ్లాడు. గిల్ (79 నాటౌట్) ప్లేస్‌లో శ్రేయాస్ అయ్యర్ క్రీజ్‌లోకి వచ్చాడు. విరాట్ కోహ్లీ 37 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ప్రస్తుతం స్కోరు 24 ఓవర్లు 173-1.
IND Vs NZ Live Score: టీమిండియా దూకుడు కొనసాగుతోంది. 20 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి పరుగులు 150 పరుగులు చేసింది. గిల్ (74), కోహ్లీ (26) క్రీజ్‌లో ఉన్నారు.
IND Vs NZ Live Score: శాంట్నర్ ఓవర్‌లో శుభ్‌గిల్ ఓ సిక్సర్, ఫోర్ బాదాడు. ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. భారత్ స్కోరు. 17 ఓవర్లు 132-1.
IND Vs NZ Live Score: డ్రింక్స్ (15 ఓవర్లు) సమయానికి భారత్ ఒక వికెట్ నష్టానికి 118 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో శుభ్‌మన్ గిల్ (52), విరాట్ కోహ్లీ (16) క్రీజ్‌లో ఉన్నారు.
IND Vs NZ Live Score: యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ దుమ్ములేపుతున్నాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో గిల్‌కు ఇది నాలుగో అర్ధ సెంచరీ.
IND Vs NZ Live Score: 13 ఓవర్‌లో శుభ్‌మన్ గిల్ దుమ్ములేపాడు. ఫెర్గూసన్ బౌలింగ్‌లో ఓ సిక్స్, ఫోర్ బాదాడు. దీంతో ఈ ఓవరల్‌లో 12 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం స్కోరు 13 ఓవర్లు 107/1
IND Vs NZ Live Score: రోహిత్ శర్మ ఔట్ అయిన తరువాత టీమిండియా జోరు కాస్త తగ్గింది. శుభ్‌మన్ గిల్ (38), విరాట్ కోహ్లీ (4) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం స్కోరు 12 ఓవర్లు 92-1.
IND Vs NZ Live Score: టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (29 బంతుల్లో 47, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సౌథీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. కేన్ విలియమ్సన్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చాడు. గిల్ (21 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు. 8.3 ఓవర్లు 71-1.
కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్‌లో 50 సిక్సర్లు బాదిన తొలిప్లేయర్‌గా నిలిచాడు.
IND Vs NZ Live Score: కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. 5 ఓవర్లు ముగిసేసరికి భారత్ 47 పరుగులు చేసింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 18 బంతుల్లోనే 34 పరుగులతో ఆడుతున్నాడు. గిల్ 11 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.
తొలి ఓవర్‌లోనే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బాదుడు మొదలు పెట్టాడు. ట్రెంట్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు బాదాడు. తొలి ఓవర్‌లో మొత్తం 10 పరుగులు వచ్చాయి.
India Vs New Zealand Playing 11: తుది జట్లు ఇలా..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ, లాకీ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్
India Vs New Zealand Toss Updates: కీలక పోరులో టీమిండియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
World Cup 2023 Semifinal Rules: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఇక మిగిలింది కేవలం సెమీస్, పైనల్స్ మాత్రమే. మెగా టోర్నీ టైటిల్ కోసం రెండు సెమీస్ దశలు దాటాల్సి ఉంది. మరి సెమీపైనల్స్‌లో వర్షం పడితే పరిస్థితి ఏంటి, విజేతను ఎలా నిర్ణయిస్తారనేది తెలుసుకుందాం..
వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ముంబైలోని వాంఖేడే స్టేడియంలో బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు టాస్ వేయనున్నారు. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టిప్స్ మీ కోసం..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన వారిలో విరాట్ కోహ్లీ, రచిన్ రవీంద్ర టాప్-2లో ఉన్నారు. కోహ్లీ 9 మ్యాచ్‌ల్లో 594 పరుగులు చేయగా.. రవీంద్ర 9 మ్యాచ్‌ల్లో 563 పరుగులు చేశాడు.
Team India Semi Finals Records: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ పోరు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు టీమిండియా ఎన్నిసార్లు సెమీస్‌కు చేరుకుంది..? ఎన్ని విజయాలు సాధించింది..? ఓసారి లుక్కేద్దాం పదండి..
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.