IPL Auction 2024 Live: ఉత్కంఠగా ముగిసిన ఐపీఎల్ వేలం.. జాక్‌పాట్ కొట్టేసిన ప్లేయర్లు వీళ్లే..!
IPL Auction 2024 Live Updates: ఐపీఎల్ మినీ వేలం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఏ ఆటగాడికి ఏ జట్టును తీసుకుంటుంది..? ఏ ప్లేయర్‌కు అత్యధిక ధర దక్కుతుంది..? అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఐపీఎల్ వేలం లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL Auction 2024 Live Updates: దుబాయ్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024 వేలం నేడు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలిసారిగా దేశం వెలుపల ఐపీఎల్ వేలం నిర్వహిస్తున్నారు. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్నారు. ఇందులో 214 మంది భారతీ ఆటగాళ్లు, 119 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 116 మంది క్యాప్డ్, 215 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. మినీ వేలంలో 10 ఫ్రాంచైజీలు 77 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకోనున్నాయి. ఇందులో 30 మంది విదేశీ ఆటగాళ్లకు తీసుకోవాల్సి ఉంటుంది. దుబాయ్‌లోని కోకాకోలా ఎరీనాలో ఆటగాళ్ల వేలం జరగనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో వేలంపాట నిర్వహించిన మల్లికా సాగర్.. మినీ ఐపీఎల్ వేలం కూడా నిర్వహించనున్నారు. ఐపీఎల్ చరిత్రలో వేలం నిర్వహిస్తున్న తొలి మహిళా క్రీడాకారిణి కూడా ఆమెనే కావడం విశేషం. ఐపీఎల్ వేలానికి సంబంధించి లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
IPL Auction 2024 Live Updates: రెండోసారి అమ్ముడైన అన్‌సోల్డ్ ప్లేయర్లు వీళ్లే
==> షైహోప్-రూ.75 లక్షలు-DC
==> అట్కిన్సన్-రూ.కోటి-KKR
==> స్వస్తిక్ చికార-రూ.20 లక్షలు-DC
==> శివాలిక్ శర్మ-రూ.20 లక్షలు-MI
==> స్వప్నిల్ సింగ్-రూ.20 లక్షలు-RCB
==> అవినిష్ అరవెల్లి-రూ.20 లక్షలు-CSK
==> నాండ్రే బర్గర్-రూ.50 లక్షలు-RR
==> షాకిబ్ హుస్సేన్-రూ.2 లక్షలు-KKR
==> సౌరవ్ చౌహన్-రూ.2 లక్షలు-RCBIPL Auction 2024 Live Updates: అఫ్గాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీని రూ.కోటి 50 లక్షలకు ముంబై తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ఆల్‌రౌండర్ అర్షద్ ఖాన్‌ను రూ.20 లక్షల కనీస ధరకు లక్నో తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: అఫ్గాన్ స్పిన్నర్ ముజీబ్ రెహ్మన్‌ను రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: లూకీ ఫెర్గుసన్‌ను రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌కు ఆర్‌సీబీ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలీ రోసో మొదట్లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోగా.. రెండోసారి పేరు వేలంలోకి వచ్చింది. రూ.2 కోట్లు బేస్ ప్రైస్ కాగా.. ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి. చివరకు రూ.8 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌సోల్డ్ ప్లేయర్లను మళ్లీ వేలంలోకి తీసుకువచ్చారు. రూ.50 లక్షల బేస్ ప్రైస్‌కు మనీశ్ పాండేను కేకేఆర్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: టీమిండియా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ జాతవేద్ సుబ్రమణ్యన్‌ను రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: టీమిండియా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ప్రిన్స్ చౌదరిని రూ.20 లక్షల బేస్ ప్రైస్ పంజాబ్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రాబిన సింగ్ రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి రాగా.. ముంబై, చెన్నై జట్లు పోటీ పడ్డాయి. చెన్నై తప్పుకోగా.. గుజరాత్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత ఎస్‌ఆ్‌హెచ్‌కు కూడా పోటీ పడింది. చివరకు రూ.3 కోట్ల 60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: తనయ్ త్యాగరాజన్‌ను రూ.20 లక్షల బేస్ ప్రైస్ పంజాబ్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: శశాంగ్ సింగ్‌ను రూ.20 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: విశ్వనాథ్ సింగ్‌ను రూ.20 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: ఆల్‌రౌండర్ అశుతోష్ శర్మను రూ.20 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ సుమిత్ కుమార్ రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. రూ.కోటికి ఢిల్లీ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ అన్షుల్ కాంబోజ్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ముంబై తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: ఆల్‌రౌండర్ నమన్ దీప్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ముంబై తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: శ్రీలంక బౌలర్ నువాన్ తుషార రూ.50 లక్షల కనీస ధరతో వేలంలో పాల్గొన్నాడు. ఆర్‌సీబీ, ముంబై జట్లు పోటీ పడగా.. చివరకు రూ.4 కోట్ల 80 లక్షలకు ముంబై ఇండియన్స్ తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: ఆసీస్ బౌలర్ రిజర్డ్ సన్ రూ.కోటి 50 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి రాగా.. ఢిల్లీ, ఆర్‌సీబీ జట్లు పోటీ పడ్డాయి. చివరకు రూ.5 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: బంగ్లా ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌కు చెన్నై దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ రూ.50 లక్షలతో వేలంలోకి రాగా.. గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. రేటు అంతకుఅంత పెరగ్గా.. చివరకు రూ.10 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లీ రూ.2 కోట్లతో వేలంలోకి రాగా.. కనీస ధరకు లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ టామ్ కరన్ రూ.కోటి 50 లక్షల బేస్‌ప్రైస్‌కు ఆర్‌సీబీ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: ఆస్ట్రేలియా ప్లేయర్ టర్నర్‌ను రూ.కోటి బేస్‌ప్రైస్‌కు లక్నో సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: విండీస్ బ్యాట్స్‌మెన్ రూథర్ ఫర్డ్‌ను రూ.కోటి 50 లక్షల బేస్‌ప్రైస్‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: ఐపీఎల్ వేలంలో జట్లలో మిగిలిన పర్స్ ఎంతంటే..?
==> RCB - 6.75 కోట్లు
==> KKR - 6.55 కోట్లు
==> PBKS - 13.15 కోట్లు
==> CSK- 3.20 కోట్లు
==> DC - 16.85 కోట్లు
==> RR - 0.90 కోట్లు
==> MI - 7.95 కోట్లు
==> SRH - 3.40 కోట్లు
==> LSG - 4.15 కోట్లు
==> GT - 21.45 కోట్లు
IPL Auction 2024 Live Updates: స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ముంబై ఇండియన్స్ తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ఎం.సిద్ధార్థ్ రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. రూ.2 కోట్ల 40 లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: మానవ్ సుతార్‌ను రూ.20 లక్షల కనీస ధరకు గుజరాత్ టైటాన్స్ తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: రసీక్ దార్‌ను రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: బౌలర్ కార్తీక్ త్యాగి రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. రూ.60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ వేలంలో దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ఆకాశ్ సింగ్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ఎస్‌ఆర్‌హెచ్ తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: సుశాంత్ మిశ్రా రూ.20 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి రాగా.. గుజరాత్, ముంబై జట్లు పోటీ పడ్డాయి. చివరకు రూ.2 కోట్ల 20 లక్షలకు గుజరాత్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: యాష్ ధయాల్ రూ.20 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి వచ్చాడు. రూ.5 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది. గుజరాత్ చివరకు పోటీపడి విరమించుకుంది.
IPL Auction 2024 Live Updates: కుమార్ కుశాగ్ర భారీ ధర పలికాడు. రూ.20 లక్షలతో వేలంలోకి రాగా.. రూ.7 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. చివరకు గుజారాత్ పోటీ పడింది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ఆటగాడు రికీ భుయ్‌ను రూ.20 లక్షల కనీస ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కోలర్ కాడ్‌మోర్‌ను రూ.40 లక్షల బేస్ ప్రైస్‌కు రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రమణ్‌దీప్ సింగ్‌ను రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: షారుక్ ఖాన్ రూ.20 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. గుజరాత్, పంజాబ్ జట్లు పోటీపడ్డాయి. చివరకు రూ.7 కోట్ల 40 లక్షలకు గుజరాత్ టైటాన్స్ కైవసం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ ఆర్జిన్ కుల్‌కర్ణిని రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రఘువంశీని రూ.20 లక్షల బేస్ ప్రైస్‌కు కేకేఆర్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ సమీర్ రిజ్వి రూ.20 లక్షల బేస్ ప్రైస్ వేలంలోకి రాగా.. చెన్నై, ఢిల్లీ జట్లు రేటు పెంచుకుంటూ పోయాయి. రూ.8 కోట్ల 40 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ శుభమ్ దూబేను రూ.20 లక్షల బేస్ ప్రైస్ వేలంలోకి రాగా.. అనూహ్యంగా భారీ ధర పలికాడు. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు రూ.5 కోట్ల 80 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: పంజాబ్ కింగ్స్ బౌలింగ్ దళం బలంగా మారింది. కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, సామ్ కర్రాన్, హర్షల్ పటేల్ ప్రధాన బౌలర్లుగా వ్యవహరిస్తారు.
IPL Auction 2024 Live Updates: సెట్ 6లోని ఆటగాళ్లలో ఒక్కరు కూడా అమ్ముడుపోలేదు.
==> అకేల్ హోసేన్- వెస్టిండీస్
==> ముజీబ్ రెహమాన్ - ఆఫ్ఘనిస్తాన్
==> ఆదిల్ రషీద్ - ఇంగ్లాండ్
==> మహ్మద్ వకార్ సలాంఖైల్- ఆఫ్ఘనిస్తాన్
==> తబ్రైజ్ షమ్సీ- దక్షిణాఫ్రికా
==> ఇష్ సోధి - న్యూజిలాండ్IPL Auction 2024 Live Updates: శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశనక రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. రూ.4 కోట్ల 60 లక్షలకు ముంబై సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: టీమిండియా బౌలర్ జయదేవ్ ఉనద్కత్ రూ.50 లక్షల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి రాగా.. ఢిల్లీ, ఎస్‌ఆర్‌హెచ్ పోటీపడ్డాయి. రూ.కోటి 60 లక్షలకు హైదరాబాద్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చాడు. ఢిల్లీ, ముంబై జట్లు సొంతం చేసుకునేందుకు తీవ్రంగా పోటీపడ్డాయి. తరువాత రేసులోకి కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో జట్లు వచ్చాయి. ఏ మాత్రం తగ్గేదేలా అంటూ వేలంలో దూసుకుపోయాయి. పోటీ పడుతూ మరి రేటు పెంచుకుంటూ పోయాయి. చివరకు రూ.24 కోట్ల 75 లక్షలకు కేకేఆర్ దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ నిలిచాడు.
IPL Auction 2024 Live Updates: టీమిండియా యంగ్ బౌలర్ శివమ్ మావి రూ.50 లక్షలు బేస్ ప్రైస్ కాగా.. లక్నో, ఆర్‌సీబీలు అనూహ్యంగా పోటీ పడ్డాయి. దీంతో ఈ యంగ్ బౌలర్ ధర పెరుగుతూ పోయింది. చివరకు రూ.6 కోట్ల 40 లక్షలకు లక్నో సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ రూ.2 కోట్లతో వేలంలోకి రాగా.. గుజరాత్, హైదరాబాద్ జట్లు పోటీ పడ్డాయి. మధ్యలో ఢిల్లీ వేలంలోకి వచ్చినా.. చివరకు రూ.5 కోట్ల 80 లక్షలకు గుజరాత్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: విండీస్ ఫాస్ట్ బౌలర్ అల్జరీ జోసఫ్ రూ.కోటితో వేలంలోకి రాగా.. చెన్నై, ఢిల్లీ పోటీపడ్డాయి. తరువాత చెన్నై తప్పుకోగా.. లక్నో వేలంలోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత బెంగళూరు రాగా.. రేటు భారీగా పెరిగింది. లక్నో, ఆర్‌సీబీ తీవ్రంగా పోటీపడగా.. మధ్యలో చెన్నై కూడా ఎంట్రీ ఇచ్చింది. చివరకు రూ.11 కోట్ల 50 లక్షలకు బెంగళూరు సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: టీమిండియా యంగ్ బౌలర్ చేతన్ సకారియాను రూ.50 లక్షల బేస్ ప్రైస్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: టీమిండియా వికెట్ కీపర్ కేఎస్ భరత్‌ను రూ.50 లక్షల బేస్ ప్రైస్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: సౌతాఫ్రికా వికెట్ కీపర్ ట్రిస్థాన్ స్టబ్స్ సాల్ట్ రూ.50 లక్షల బేస్ ప్రైస్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: ఇప్పటివరకు జరిగిన వేలం ఇలా..
==> రోవ్‌మన్ పావెల్ - రూ.7.40 కోట్లు (RR)
==> రిలీ రోసౌ - అన్‌సోల్డ్
==> హ్యారీ బ్రూక్ - రూ.4 కోట్లు (DC)
==> ట్రావిస్ హెడ్ - రూ.6.80 కోట్లు (SRH)
==> కరుణ్ నాయర్ - అన్‌సోల్డ్
==> స్టీవ్ స్మిత్ - అన్‌సోల్డ్
==> మనీష్ పాండే - అన్సోల్డ్సెట్ 2
==> వానిందు హసరంగా - రూ.1.50 కోట్లు (SRH)
==> రచిన్ రవీంద్ర - రూ.1.80 కోట్లు (CSK)
==> శార్దూల్ ఠాకూర్ - రూ.4 కోట్లు (CSK)
==> అజ్మతుల్లా ఒమర్జాయ్ - 50 లక్షలు (GT)
==> పాట్ కమిన్స్ - రూ.20.50 కోట్లు (SRH)
==> గెరాల్డ్ కోయెట్జీ- రూ.5 కోట్లు (MI)
==> హర్షల్ పటేల్ - రూ.11.75 కోట్లు (PBKS)
==> డారిల్ మిచెల్ - రూ.14 కోట్లు (MI)
==> క్రిస్ వోక్స్ - రూ.4.20 కోట్లు (PBKS)IPL Auction 2024 Live Updates: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చాడు. రూ.4 కోట్ల 20 లక్షలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ డారిల్ మిచెల్ రూ.కోటితో వేలంలోకి రాగా.. పంజాబ్ జట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. మధ్యలో ఢిల్లీ తప్పుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో రేటు మరింత భారీగా పెరిగింది. చివరకు రూ.14 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.
IPL Auction 2024 Live Updates: టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్ రూ.2 కోట్లతో బేస్ ప్రైస్ వేలంలోకి రాగా.. పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీపడ్డాయి. మధ్యలో గుజరాత్ తప్పుకోగా.. వేలంలోకి లక్నో ఎంట్రీ ఇచ్చింది. లక్నో, పంజాబ్ తీవ్రంగా పోటీపడగా.. చివరకు రూ.11 కోట్ల 75 లక్షలకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: సౌతాఫ్రికా స్టార్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.5 కోట్లకు ముంబై ఇండియన్స్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ రూ.2 కోట్లతో వేలంలోకి రాగా.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడ్డాయి. మధ్యలో ముంబై తప్పుకోగా.. బెంగళూరు ఎంట్రీ ఇచ్చింది. ఆర్‌సీబీ, సీఎస్‌కే పోటీ పడగా.. తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్‌సీబీ, ఎస్ఆర్‌హెచ్ తీవ్రంగా పోటీపడ్డాయి. అమాంతం రేటు పెంచుకుంటూ పోయాయి. చివరకు రూ.20 కోట్ల 50 లక్షలకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: ఆఫ్ఘానిస్థాన్ ఆటగాడు ఒమర్జాయ్‌ను రూ.50 లక్షల బేస్ ప్రైస్‌కు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: టీమిండియా ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ రూ.2 కోట్లతో వేలంలో రాగా.. ఎస్‌ఆర్‌హెచ్, సీఎస్‌కే జట్లు పోటీ పడ్డాయి. రూ.4 కోట్లకు చెన్నై దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. రూ.కోటి 80 లక్షలకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. వరల్డ్ కప్‌లో అదరగొట్టిన రచిన్‌కు భారీ దక్కుతుందని ఊహించినా.. తక్కువ ధరకే సీఎస్‌కే దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: శ్రీలంక ఆల్‌రౌండర్ హసరంగా రూ.కోటి 50 లక్షలకు వేలంలోకి రాగా.. బేస్ ప్రైస్‌కే ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: తొలి సెట్ వేలం పూర్తయింది. రోసో, స్టీవ్ స్మిత్, మనీశ్ పాండే అమ్ముడుపోలేదు.
IPL Auction 2024 Live Updates: వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ రూ.2 కోట్లతో బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పోటీ పడ్డాయి. రూ.6 కోట్ల 80 లక్షలకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: హార్డ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ బేస్ ప్రైస్ రూ.2 కోట్లతో వేలంలోకి రాగా.. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడ్డాయి. ఢిల్లీ జట్టు రూ.4 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్‌లో రూ.13.25 కోట్లకు అమ్ముడుపోగా.. ఈ సీజన్‌లో కేవలం రూ.4 కోట్లే పలికాడు.
IPL Auction 2024 Live Updates: ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. విండీస్ ఆల్‌రౌండర్ రోవ్‌మన్ పావెల్‌కు భారీ ధర దక్కింది. పావెల్‌ను దక్కించుకునేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ వేలంలో భారీగా పోటీ పడ్డాయి. ఈ స్టార్ ఆల్‌రౌండర్ బేస్ ప్రైస్ రూ.కోటితో వేలంలోకి రాగా.. చివరకు రూ.7 కోట్ల 40 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
IPL Auction 2024 Live Updates: మొత్తం 332 మంది ఆటగాళ్లు బ్యాటర్లు, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్లు, ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు, అన్‌క్యాప్డ్ ప్లేయర్లను క్యాటగిరీల వారీగా 19 సెట్లలో వేలం నిర్వహించనున్నారు.
IPL Auction 2024 Live Updates: ఐపీఎల్ వేలం జరిగే వేదిక చిత్రాన్ని ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.
IPL Auction 2024 Live Updates: ఇంగ్లాండ్ జట్టు 19 ఏళ్ల యువ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్ రెహాన్ అహ్మద్ ఐపీఎల్ వేలం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. బంగ్లాదేశ్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్లు తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం కూడా ఐపీఎల్ వేలం నుంచి తప్పుకున్నారు.
IPL Auction 2024 Live Updates: మినీ వేలంలో 10 ఫ్రాంచైజీలు కలిపి మొత్తం రూ.262.5 కోట్లు ఖర్చు చేయనున్నాయి.
ఒక్కో జట్టులో ఎంత ఉందంటే..?
==> గుజరాత్ టైటాన్స్ (రూ.38.15 కోట్లు)
==> సన్‌రైజర్స్ హైదరాబాద్ (రూ.34 కోట్లు)
==> కోల్‌కతా నైట్ రైడర్స్ (రూ.32.7 కోట్లు)
==> చెన్నై సూపర్ కింగ్స్ (రూ.31.4 కోట్లు)
==> పంజాబ్ కింగ్స్ (రూ.29.1 కోట్లు)
==> ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.28.95 కోట్లు)
==> రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (రూ.23.25 కోట్లు)
==> ముంబై ఇండియన్స్ (రూ.17.75 కోట్లు)
==> రాజస్థాన్ రాయల్స్ (రూ.14.5 కోట్లు)
==> లక్నో సూపర్ జెయింట్స్ (రూ.13.15 కోట్లు)IPL Auction 2024 Latest Updates: వేలానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎవరిని ఏ ఫ్రాంఛైజీ తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వేలంలో టీమిండియా టాప్-5 ఆటగాళ్లపై అందరీ దృష్టి నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL Auction 2024 Live Updates: ఐపీఎల్ మినీ వేలం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష ప్రసారం JioCinema యాప్‌లో లైవ్ స్ట్రీమింగ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
IPL Auction 2024 Live Updates: ప్రతి ఐపీఎల్ జట్టులో 18 నుంచి 25 మంది ఆటగాళ్లు ఉండాలి. ఒక్కో జట్టులో గరిష్టంగా 8 మంది విదేశీ ఆటగాళ్లను చేర్చుకోవచ్చు.