IPL 2024 Auction: ఐపీఎల్ వేలానికి రంగం సిద్ధం.. ఈ టాప్-5 టీమిండియా ప్లేయర్లపైనే అందరి దృష్టి

IPL Auction 2024 Latest Updates: ఐపీఎల్ 2024 మినీ వేలానికి రంగం సిద్దమైంది. రేపు దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 1 గంటకు వేలం ప్రారంభంకానుంది. వేలానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎవరిని ఏ ఫ్రాంఛైజీ తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వేలంలో టీమిండియా టాప్-5 ఆటగాళ్లపై లుక్కేయండి.
 

  • Dec 19, 2023, 00:01 AM IST
1 /5

ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు పేసర్ హర్షల్ పటేల్‌ను 10.75 కోట్ల రూపాయలకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. హర్యానాకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ మంచి ప్రదర్శన చేసి ఆ సీజన్‌లో 19 వికెట్లు పడగొట్టాడు. 2023 సీజన్‌లో 14 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఎకానమీ రేటు 9.65తో పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఆర్‌సీబీ వదులుకుంది. హర్షల్ బేస్ ధర రూ.2 కోట్లతో వేలంలోకి రానున్నాడు.  

2 /5

ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను కూడా 2024 సీజన్‌కు ముందు కేకేఆర్ విడుదల చేసింది. 2023 సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో ఒక అర్ధ సెంచరీ సహాయంతో 113 పరుగులు చేసి 7 వికెట్లు తీశాడు. శార్దూల్ బేస్ ధర కూడా రూ.2 కోట్లగా ఉంది.   

3 /5

యువ పేసర్ చేతన్ సకారియా గత సీజన్‌లో కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. 2022లో కూడా అతను కేవలం 3 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు తీశాడు. 2021లోనే టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు.   

4 /5

అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో శివమ్ మావిని కేకేఆర్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. 2018లో కేకేఆర్ తరపున అరంగేట్రం చేశాడు. శివమ్ తన బేస్ ధరను రూ.50 లక్షలతో వేలంలో పాల్గొననున్నాడు.  

5 /5

రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో మనీష్ పాండే వేలంలోకి రానున్నాడు. ఆర్‌సీబీ, పూణె వారియర్స్, కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటిల్స్ జట్లకు మనీశ్ పాండే ప్రాతినిధ్యం వహించాడు.