IPL Mega Auction 2025 Live Updates: కేఎల్ రాహుల్‌కు షాక్.. హ్యాండిచ్చిన ఆర్‌సీబీ.. తక్కువ ధరకే..!

Sun, 24 Nov 2024-5:34 pm,

IPL Mega Auction 2025 Live News: ఐపీఎల్ 2025 మెగా వేలం నేడు, రేపు జరగనుంది. 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ వేలం ప్రారంభంకానుంది. లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL Mega Auction 2025 Live News: క్రికెట్ అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సర్వం సిద్ధమైంది. మొత్తం 577 మంది ఆటగాళ్లు వేలంలో ఉండగా.. 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యాయి. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, షమీ వంటి స్టార్ ప్లేయర్లు వేలంలోకి వస్తుండడంతో భారీ ఆసక్తి నెలకొంది. రూ.25 కోట్ల రికార్డు బ్రేక్ అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నేడు, రేపు రెండు రోజులపాటు వేలం కొనసాగనుంది. ఈ రోజు వేలంలోకి పంత్, అయ్యర్, అర్ష్‌దీప్‌ రానుండగా.. రెండో సెట్‌లో రేపు కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ పేర్లు ఉన్నాయి. మొత్తం 1574 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకోగా.. 1000 మంది పేర్లు తొలగించి 574 మంది ఆటగాళ్ల పేర్లు షార్ట్ లిస్ట్ చేశారు. మొత్తం 366 మంది భారత ఆటగాళ్లు కాగా.. 208 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం మొదలుకానుంది. ఐపీఎల్ 2025 వేలానికి సంబంధించి లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
 

Latest Updates

  • IPL Mega Auction 2025 Live News: ఇప్పటివరకు అమ్ముడుపోయిన ప్లేయర్లు

    ==> అర్ష్‌దీప్ సింగ్: పంజాబ్ కింగ్స్ - రూ.18 కోట్లు (RTM)
    ==> కగిసో రబడ: గుజరాత్ టైటాన్స్ - రూ. 10.75 కోట్లు
    ==> శ్రేయాస్ అయ్యర్: పంజాబ్ కింగ్స్ - రూ 26.75 కోట్లు
    ==> జోస్ బట్లర్: గుజరాత్ టైటాన్స్ - రూ. 15.75 కోట్లు
    ==> మిచెల్ స్టార్క్: ఢిల్లీ క్యాపిటల్స్ - రూ. 11.75 కోట్లు
    ==> రిషబ్ పంత్: లక్నో సూపర్ జెయింట్స్ - రూ.27 కోట్లు
    ==> మహ్మద్ షమీ: సన్‌రైజర్స్ హైదరాబాద్ - రూ.10 కోట్లు
    ==> డేవిడ్ మిల్లర్: లక్నో సూపర్ జెయింట్స్ - రూ.7.5 కోట్లు
    ==> యుజ్వేంద్ర చాహల్: పంజాబ్ కింగ్స్ - రూ.18 కోట్లు
    ==> మహ్మద్ సిరాజ్: గుజరాత్ టైటాన్స్ - రూ.12.25 కోట్లు
    ==> లియామ్ లివింగ్‌స్టోన్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు -రూ 8.75 కోట్లు
    ==> కేఎల్ రాహుల్: ఢిల్లీ క్యాపిటల్స్ - రూ.14 కోట్లు

  • KL Rahul Price in IPL Mega Auction 2025: కేఎల్ రాహుల్‌ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ దక్కించుకుంటుందని అందరూ భావించారు. అనుకున్నట్లే వేలంలో పోటీ పడింది. అయితే రూ.11 కోట్ల వద్దే పోటీ నుంచి తప్పుకుంది. రూ.14 కోట్లకు ఢిల్లీ బిడ్ వేసినా.. పట్టించుకోలేదు. పర్స్‌లో డబ్బులు ఉన్నా.. ఆర్‌సీబీ కీలక ప్లేయర్‌ను దక్కించుకోలేదు.

  • KL Rahul: టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. కేకేఆర్, ఆర్‌సీబీ పోటీ పడ్డాయి. తరువాత ఢిల్లీ ఎంట్రీ ఇవ్వగా.. చెన్నై కూడా పోటీలోకి వచ్చింది. రూ.14 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అయితే ఊహించిన ధర కంటే తక్కువ ధరకే రాహుల్ అమ్ముడుపోయాడు.

  • Liam Livingstone Price in IPL Mega Auction 2025: ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చాడు. ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ జట్లు బిడ్ ఓపెన్ చేశాయి. ఢిల్లీ, చెన్నై పోటీలోకి వచ్చినా రూ.8.75 కోట్లకు ఆర్‌సీబీ దక్కించుకుంది.

  • Mohammed Siraj Price in IPL Mega Auction 2025: మహ్మద్ సిరాజ్ రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. గుజరాత్ బిడ్ ఓపెన్ చేసింది. చెన్నై పోటీ పడడంతో రేటు పెరిగింది. సీఎస్‌కే తప్పుకోవడంతో రాజస్థాన్ పోటీలోకి వచ్చింది. అయినా గుజరాత్ వెనక్కి తగ్గకుండా రూ.12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.

  • Yuzvendra Chahal Price in IPL Mega Auction 2025: రూ.2 కోట్లతో యుజ్వేంద్ర చాహల్ వేలంలోకి రాగా.. సీఎస్‌కే, లక్నో జట్లు పోటీ పడ్డాయి. చెన్నై తప్పుకోగా.. పంజాబ్ పోటీలోకి వచ్చింది. రూ.14 కోట్ల వద్ద ఆర్‌సీబీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సన్‌రైజర్స్ పోటీలోకి రావడంతో రేటు అమాంతం పెరుగుతూ పోయింది. చివరకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ రూ.18 కోట్లకు దక్కించుకుంది.

  • David Miller Price in IPL Mega Auction 2025: రూ.1.50 కోట్ల బేస్ ప్రైస్‌తో డేవిడ్ మిల్లర్ వేలంలోకి రాగా.. గుజరాత్, ఆర్‌సీబీ జట్లు పోటీలోకి వచ్చాయి. గుజరాత్ తప్పుకోగా.. ఢిల్లీ ఎంట్రీతో రేటు మరింత పెరిగింది. చివర్లో పోటీలోకి వచ్చిన లక్నో రూ.7.50 కోట్లకు దక్కించుకుంది.

  • Mohammed Shami Price in IPL Mega Auction 2025: రెండో సెట్‌లో మొదటి పేరు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ పేరు వచ్చింది. చెన్నై, కేకేఆర్ జట్లు పోటీపడ్డాయి. చివర్లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఎంట్రీ రూ.10 కోట్లకు దక్కించుకుంది. 

  • Rishabh Pant Price in IPL Mega Auction 2025: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిషబ్ పంత్ పేరు వేలంలోకి రాగానే.. లక్నో, ఆర్‌సీబీ జట్లు పోటాపోటీగా బోర్డులు ఎత్తాయి. దీంతో క్షణాల్లో రేటు పెరుగుతూ పోయింది. మధ్యలో ఎస్‌ఆర్‌హెచ్ పోటీ పడినా.. లక్నో మాత్రం వెనక్కి తగ్గలేదు. చివరకు రూ.20.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. ఢిల్లీ ఆర్‌టీఏం కార్డు ఉపయోగించగా.. లక్నో రూ.27 కోట్లకు ఫైనల్ బిడ్ వేసింది. ఢిల్లీ అంత ఇవ్వకపోవడంతో లక్నోకు రూ.27 కోట్లకు అమ్ముడుపోయాడు.

  • Mitchell Starc Price in IPL Mega Auction 2025: ఆసీస్ స్టార్ పేసర్ రూ.2 కోట్లతో వేలంలోకి రాగా.. ముంబై ఇండియన్స్ బిడ్ ఓపెన్ చేసింది. కేకేఆర్ పోటీ పడడంతో రేటు పెరుగుతూ పోయింది. ముంబై తప్పుకోగా.. కేకేఆర్, ఢిల్లీ జట్లు పోటీ పడ్డాయి. కేకేఆర్ తప్పుకోగా.. ఆర్‌సీబీ పోటీలోకి వచ్చింది. చివరకు రూ.11.75 కోట్లకు ఢిల్లీ దక్కించుకుంది.

  • Jos Buttler Price in IPL Mega Auction 2025: ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ రూ.2 కోట్లతో వేలంలోకి రాగా.. ఆరంభంలో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పోటీ పడ్డాయి. రాజస్థాన్ తప్పుకోగా.. పంజాబ్ పోటీ పడింది. లక్నో సూపర్ జెయింట్స్ ఎంట్రీతో రేటు మరింత పెరిగింది. గుజరాత్ వెనక్కి తగ్గకుండా రూ.15.75 కోట్లకు దక్కించుకుంది.

  • Shreyas Iyer Price in IPL Mega Auction 2025: టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. కేకేఆర్, పంజాబ్ జట్లు ఆరంభంలో పోటీ పడ్డాయి. మధ్యలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎంట్రీ ఇచ్చింది. కేకేఆర్ తప్పుకోగా.. ఢిల్లీ, పంజాబ్ జట్లు పోటీ పడ్డాయి. రెండు జట్లు వెనక్కి తగ్గకపోవడంతో ధర రికార్డు స్థాయికి చేరింది. చివరకు రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.

  • Kagiso Rabada Price in IPL Mega Auction 2025: సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి రాగా..తీవ్ర పోటీ మధ్య రూ.10.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.

  • Arshdeep Singh Price in IPL Mega Auction 2025: వేలంలో మొదటి పేరు అర్ష్‌దీప్ సింగ్ పేరు వచ్చింది. ఊహించినట్లే భారీ ధర దక్కించుకున్నాడు. రూ.2 కోట్ల బేస్‌ ప్రైస్‌తో వేలంలోకి రాగా.. చెన్నై, ఢిల్లీ జట్లు తీవ్రంగా పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్ టైటాన్స్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఢిల్లీ తప్పుకోగా.. ఆర్‌సీబీ పోటీ పడింది. దీంతో అర్ష్‌దీప్ రేటు మరింత పెరిగింది. రాజస్థాన్, ఎస్‌ఆర్‌హెచ్‌ కూడా బిడ్ ఓపెన్ చేశాయి. చివరకు రూ.15.75 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ దక్కించుకుంది. పంజాబ్ ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగించగా.. ఎస్‌ఆర్‌హెచ్ రూ.18 కోట్లు ఆఫర్ చేసింది. అంతే మొత్తం పంజాబ్ ఇస్తామనడంతో మళ్లీ పాత టీమ్‌కే అమ్ముడుపోయాడు.

     

  • IPL Mega Auction 2025 Live Updates: ఏ జట్టులో ఇంకా ఎంత ప్లేయర్లను తీసుకోవచ్చంటే..?

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ==> చెన్నై సూపర్ కింగ్స్: 20  

    ==> రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 22  

    ==> సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 

    ==> ముంబై ఇండియన్స్: 20 

    ==> ఢిల్లీ రాజధానులు: 21 

    ==> రాజస్థాన్ రాయల్స్: 19 

    ==> పంజాబ్ కింగ్స్: 23 

    ==> కోల్‌కతా నైట్ రైడర్స్: 19 

    ==> గుజరాత్ టైటాన్స్: 20 

    ==> లక్నో సూపర్ జెయింట్స్: 20 

  • IPL Mega Auction 2025 Live Updates: మొదటి రోజు కేవలం 84 మంది ఆటగాళ్లను మాత్రమే వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి 12 సెట్లు మాత్రమే కవర్ చేయనున్నారు. మిగిలిన ప్లేయర్లు సోమవారం వేలం వేయనున్నారు. 

  • IPL Mega Auction 2025 Live Updates: ఒక్కొ ఫ్రాంచైజీ కనీసం 18 మంది ఆటగాళ్లను తీసుకోవాలి. గరిష్టంగా 25 మంది ఆటగాళ్ల వరకు తీసుకోవచ్చు. అన్ని జట్లు కలిపి 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. ఇంకా 204 మంది ప్లేయర్లను వేలంలో తీసుకోనున్నాయి. 

  • IPL Mega Auction 2025 Live Updates: ఐపీఎల్ వేలంలోకి మరో ముగ్గురు ఆటగాళ్ల పేర్లను చేర్చారు. ఇంగ్లాండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌, అమెరికా సీమర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌, ముంబై వికెట్‌ కీపర్‌ హార్దిక్‌ తమోర్‌ వేలంలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో మొత్తం ప్లేయర్ల సంఖ్య 577కి చేరింది.

  • IPL Mega Auction 2025 Live Updates: గత ఐపీఎల్‌కు ముందు ముంబై నుంచి ఆర్‌సీబీకి రూ.17.5 కోట్లతో ట్రేడ్ అయిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఈసారి వేలానికి దూరమయ్యాడు. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న గ్రీన్.. కోలుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది.

  • IPL Mega Auction 2025 Live Updates: స్టార్ ప్లేయర్లు 12 మందిని రెండు సెట్స్‌గా విభజించారు. సెట్-1లో జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, కగిసో రబడ, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. సెట్-2లో కేఎల్ రాహుల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్ ఉన్నారు. వీరందరి బేస్ ధరలను రూ.2 కోట్లుగా ఉంది.

  • IPL Mega Auction 2025 Live Updates: అందరి కళ్లు రిషబ్‌ పంత్‌పై ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్లు మిచెల్ స్టార్క్ కోసం వెచ్చించగా.. పంత్ ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది.

  • IPL Mega Auction 2025 Live Updates: 10 ఫ్రాంచైజీల పర్స్‌లో ఉన్న డబ్బుల వివరాలు ఇలా.. 

    ==> పంజాబ్ కింగ్స్- రూ. 110.5 కోట్లు
    ==> రాజస్థాన్ రాయల్స్- రూ.41 కోట్లు
    ==> రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- రూ.83 కోట్లు
    ==> ఢిల్లీ క్యాపిటల్స్- రూ.73 కోట్లు
    ==> లక్నో సూపర్ జెయింట్స్- రూ.69 కోట్లు
    ==> గుజరాత్ టైటాన్స్- రూ.69 కోట్లు
    ==> చెన్నై సూపర్ కింగ్స్- రూ.55 కోట్లు
    ==> కోల్‌కతా నైట్ రైడర్స్- రూ.51 కోట్లు
    ==> ముంబై ఇండియన్స్- రూ.45 కోట్లు
    ==> సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ.45 కోట్లు

     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link