Darren Sammy: క్రికెట్‌పై ప్రేమ.. సూపర్ మార్కెట్‌లో కిరాణా సామాగ్రిని కూడా ఇప్పించదు! మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Darren Sammy reacts on West Indies elimination in T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12కి కూడా అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ ఆటపై మాజీ క్రికెటర్ డారెన్ సామీ నిరాశ వ్యక్తం చేశాడు.
Darren Sammy reacts on West Indies elimination in T20 World Cup 2022: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను వెస్టిండీస్ శాసించింది. భీకర బ్యాటింగ్, బౌలింగ్ ఉన్న విండీస్ జట్టు అంటే.. అన్ని క్రికెట్ జట్లు హడలిపోయేవి. వివ్ రిచర్డ్స్, డెస్మండ్ హేన్స్, గోర్డాన్ గ్రీనిడ్జ్, రిచీ రిచర్డ్సన్, మాల్కం మార్షల్, బ్రియాన్ లారా, మైఖేల్ హోల్డింగ్, కర్ట్‌లీ అంబ్రోస్, క్లైవ్ లాయిడ్, ఆండీ రాబర్ట్స్.. ఇలా చెప్పుకుంటూ పొతే జాబితా కొనసాగుతూనే ఉంటుంది. స్టార్ ప్లేయర్స్ ఉన్న విండీస్ 1975, 1979లో వన్డే ప్రపంచకప్‌లను గెలిచింది. ఎలాంటి చరిత్ర ఉన్న ఉన్న విండీ ప్రస్తుతం చాలా బలహీనంగా మారింది.
రెండుసార్లు (2012, 2016) టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్.. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 సూపర్ 12కి కూడా అర్హత సాధించలేకపోయింది. క్వాలిఫైయర్ మ్యాచ్‌లలో పనికూనల చేతిలో ఓడిన విండీస్.. భారీ మూల్యం చెల్లించుకుంది. వెస్టిండీస్ ఆటపై ఆ దేశ మాజీలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా వెస్టిండీస్ మాజీ క్రికెటర్ డారెన్ సామీ కూడా తన నిరాశ వ్యక్తం చేశాడు. ఆటగాళ్లకు ఆర్థిక భద్రత కలిగిస్తేనే విండీస్ గాడిన పడుతుందన్నారు.
వెస్టిండీస్ క్రికెట్‌కు సంబంధించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డారెన్ సామీ మాట్లాడుతూ... 'బీసీసీఐ వలె క్రికెట్ వెస్టిండీస్ తమ ఆటగాళ్లను ఇతర ఫ్రాంఛైజీ లీగ్‌లు ఆడొద్దని చెప్పలేదు. ఎందుకంటే.. వెస్టిండీస్ వద్ద సరైన నిధులు లేవు. భారతదేశం బలంగా ఉంది. బీసీసీఐ తమ ఆటగాళ్లను మరెక్కడా ఆడవద్దని ఆదేశించే స్థాయిలో ఉంది. బీసీసీఐ వద్ద డబ్బు ఉంది. విండీస్ A లిస్టర్‌తో పోల్చితే.. భారతదేశం A జాబితాలో కాంట్రాక్ట్ పొందిన ఆటగాడు సంవత్సరానికి ఒక మిలియన్ డాలర్లు (రూ. 7 కోట్లు ప్లస్ మ్యాచ్ ఫీజుతో పాటు టీవీ హక్కుల డబ్బు) సంపాదించవచ్చు' అని అన్నారు.
'చిన్న బోర్డులు తమ ఆటగాళ్లను ఇతర ఫ్రాంఛైజీ లీగ్‌లో ఆడొద్దని చెప్పడం చాలా కష్టం. క్రికెట్ ఆటపై ప్రేమతో ఆడే రోజులు పోయాయి. ప్రస్తుత రోజుల్లో క్రికెట్‌పై ప్రేమ పనికిరాదు. ఆ ప్రేమ సూపర్ మార్కెట్‌లో కిరాణా సామాగ్రిని కూడా ఇప్పించదు' అని డారెన్ సామీ సూటిగా చెప్పారు. న్యూజిలాండ్ క్రికెట్ బోర్డును చూసి వెస్టిండీస్ క్రికెట్ ఓ విషయం నేర్చుకోవాలన్నారు. ఐపిఎల్ సమయంలో కివీస్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ చేయకుండా తెలివిగా వ్యవహరిస్తోందన్నారు.
Also Read: T20 World Cup 2022 Final: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇంటికే.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే!
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ పరుగుల దాహం తీరనిది.. మరో రికార్డుకు చేరువలో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook