KL Rahul: ఐపీఎల్‌లో రాహుల్ రేర్ ఫీట్.. ధావన్, కోహ్లీ తర్వాత మనోడే..
IPL 2024: ఐపీఎల్ 17వ సీజన్ లో కేఎల్ రాహుల్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను సాధించాడు.
KL Rahul ipl records: ఐపీఎల్ 17 ఎడిషన్ లో రాజస్థాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఓపెనర్‌గా 4 వేల పరుగుల చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఆర్సీబీ తరఫున కోహ్లీ 107 ఇన్నింగ్స్‌ల్లో 4,041 పరుగులు సాధించగా.. రాహుల్ విరాట్ కంటే తక్కువ ఇన్నింగ్స్ ల్లోనే అంటే 94 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో ఈ ఫీట్ సాధించిన మూడో ఇండియన్‌గా నిలిచాడు. రాహుల్ కంటే ముందు శిఖర్ ధావన్, కోహ్లీలు ఉన్నారు. ఓవరాల్ గా ఐదో బ్యాటర్ గా నిలిచాడు.
టాప్-5 బ్యాటర్లు వీళ్లే..
==>శిఖర్ ధావన్-202 ఇన్నింగ్స్-6362 రన్స్
==>డేవిడ్ వార్నర్-162 ఇన్నింగ్స్-5909 రన్స్
==>క్రిస్ గేల్- 122 ఇన్నింగ్స్-4480 రన్స్
==>విరాట్ కోహ్లీ-107 ఇన్నింగ్స్-4041 రన్స్
==>కేఎల్ రాహుల్-94 ఇన్నింగ్స్-4041 రన్స్
రాహుల్, హుడా మెరుపులు..
లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఓపెనర్ క్వింటన్ డికాక్ కేవలం ఎనిమిది పరుగులే చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన స్టొయినిస్ సున్నా పరుగులకే వెనుదిరిగాడు. మరోవైపు రాహుల్ తన దూకుడును కొనసాగించాడు. అతడికి జత కలిసి హుడా కూడా బ్యాట్ ఝలిపించడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఈ క్రమంలో రాహుల్, హుడా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు.
ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని సందీప్ శర్మ విడదీశాడు హుడాను ఔట్ చేసి రాజస్థాన్ కు బ్రేక్ ఇచ్చాడు. హుడా 31 బంతుల్లో ఏడు ఫోర్లుతో 50 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన పూరన్ కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. 48 బంతుల్లో 76 పరుగులు చేసిన రాహుల్ ను ఆవేశ్ ఖాన్ ఔట్ చేశాడు. ఇతడి ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. చివర్లో బదోని, కృనాల్ బ్యాట్ ఝలిపించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
Also Read: Shashank Singh: ఐపీఎల్‌లో నయా హీరో.. బౌలర్లకు సింహస్వప్నంలా శశాంక్ సింగ్.. అసలు ఎవరితను?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
భారమంతా సంజూపైనే..
అనంతరం లక్ష్య చేధనను ప్రారంభించిన రాజస్థాన్ 14 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ శాంసన్(23), ధ్రువ్ జురెల్(36) ఆడుతున్నారు. అంతకుముందు ఓపెనర్లు యశస్వ జైస్వాల్ (24), బట్లర్(34) మెరుపు ఆరంభాన్నిచ్చారు.
Also read: DC Vs MI Match Highlights: ఇవేం షాట్లు బాబోయ్.. మేము ఎక్కడా సుడలే.. స్టబ్స్ పిచ్చెక్కించే బ్యాటింగ్