Mahesh Bhupathi Shocking Comments on RCB: ఈ ఏడాది జరిగిన డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ మహిళల జట్టు టైటిల్ గెలిస్తే.. 17వ సీజన్ పురుషుల ఐపీఎల్ లో మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెత్త ప్రదర్శన చేస్తుంది. ఆడిన ఏడు మ్యాచుల్లో ఒకటి గెలిచి ఇంటి బయటా విమర్శలను ఎదుర్కోంటుంది. నిన్న హైదరాబాద్ కొట్టిన దెబ్బకు డుప్లెసిస్ సేన ఏకంగా పాయింట్ల పట్టికలో అట్టడగు స్థానానికి దిగజారింది. హోం గ్రౌండ్ లో గెలవకపోతే ఎలా అని ఆ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా భారత టెన్నిస్ దిగ్గజం మహేశ్ భూపతి ఆర్సీబీ యాజమాన్యంపై  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వ‌ని బెంగ‌ళూరుపై  తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఆర్సీబీ జ‌ట్టును మ‌రొక య‌జ‌మానికి అమ్మేయాల్సిందిగా బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.  'ఐపీఎల్‌ను బతికించాలన్నా..కోట్లాది మంది ఫ్యాన్స్ న‌మ్మ‌కాన్ని నిలబెట్టాలన్నా ఆర్సీబీని కొత్త య‌జ‌మానికి అప్పగించాలని.. అప్పుడే బెంగ‌ళూరు కూడా  పూర్తిగా స్పోర్ట్స్ ఫ్రాంచైజీగా మారితుందని' మహేశ్ ట్వీట్ చేశాడు. 



కోహ్లీ, డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ స్టార్ ఆటగాళ్లు ఉన్న బెంగళూరు పరాజయం పాలవ్వడం బాధాకరమనే చెప్పాలి. కోహ్లీ, డూప్లెసిస్ బాగానే ఆడుతున్నా.. మిగతా ఫ్లేయర్లు విఫలమవుతున్నారు. మ్యాక్స్‌వెల్ అయితే దారుణంగా విఫలమవుతున్నాడు. బౌలర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. పంజాబ్ కింగ్స్‌పై విజ‌యం తప్ప.. మిగతా అన్ని మ్యాచుల్లో ఓడిపోయింది. సన్ రైజర్స్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 


Also Read: IPL 2024 Points table: హైదరాబాద్ కొట్టిన దెబ్బకు.. పాయింట్ల పట్టికలో లెక్కలు మారాయ్..


Also read: RCB vs SRH Live: 39 బంతుల్లోనే శతక్కొట్టిన హెడ్.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు సాధించిన హైదరాబాద్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి