IPL 2024 Points table: హైదరాబాద్ కొట్టిన దెబ్బకు.. పాయింట్ల పట్టికలో లెక్కలు మారాయ్..

RCB vs SRH Match: ఐపీఎల్ 2024 సీజన్ లో సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ ధాటికి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో లెక్కలన్నీ మారిపోతున్నాయి. మన తెలుగు జట్టు టాప్-4లోకి దూసుకొచ్చింది.   

Written by - Samala Srinivas | Last Updated : Apr 16, 2024, 02:16 PM IST
IPL 2024 Points table: హైదరాబాద్ కొట్టిన దెబ్బకు.. పాయింట్ల పట్టికలో లెక్కలు మారాయ్..

IPL 2024 Points table Updates: ఐపీఎల్ లో ఏ సీజన్ జరగనంత రసవత్తరంగా ఈ 17వ సీజన్ సాగుతోంది. టీమ్స్ అన్నీ హోరాహోరీగా తలపడుతున్నాయి. బంతికి, బ్యాట్ కు మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎక్కువ సార్లు బ్యాటే పైచేయి సాధిస్తూ వస్తుంది. సోమవారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్, ఆర్సీబీ జట్లు పరగుల సునామీ సృష్టించాయి. ఇరు జట్ల ఆటగాళ్లు పోటీపడి మరి ఫోర్లు, సిక్సర్లు బాదారు. ఈ మ్యాచ్ తో ఐపీఎల్ లో చాలా రికార్డులు బద్దలు అయ్యాయి. అంతేకాకుండా ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 

టాప్-4లో సన్ రైజర్స్..
ఆర్సీబీతో మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా ఐపీఎల్ పాయింట్ల టేబుల్ లో నాలుగో స్థానానికి ఎగబాకింది సన్ రైజర్స్ హైదరాబాద్. దీంతో అప్పటి వరకు ఆ స్థానంలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ ఐదో స్థానానికి పడిపోయింది. ఆరు మ్యాచుల్లో నాలుగు గెలిచి ఎనిమిది పాయింట్లతో +0.502 రన్ రేట్ ను కలిగి నాలుగో స్థానంలో ఉంది ఎస్ ఆర్ హెచ్. ఇక ఎప్పటిలాగే రాజస్థాన్ రాయల్స్ అగ్హస్థానంలో కొనసాగుతుంది. సంజూ సేన ఆరు మ్యాచుల్లో ఐదింటిలో గెలిచి పది పాయింట్లతో +0.767 నెట్ రన్ రేట్ తో నిలిచింది. రెండో స్థానంలో కేకేఆర్ కొనసాగుతోంది. అయ్యర్ సేన ఐదు మ్యాచుల్లో నాల్గింటిలో గెలిచి ఎనిమిది పాయింట్లతో +1.688 రన్ రేట్ ను సాధించింది. 

Also Read: RCB vs SRH Live: 39 బంతుల్లోనే శతక్కొట్టిన హెడ్.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు సాధించిన హైదరాబాద్..

అట్టడగున ఆర్సీబీ..
సీఎస్కే ఆరు మ్యాచుల్లో నాలుగు గెలిచి మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు ఎనిమిది పాయింట్లతో +0.726 రన్ రేట్ ను కలిగి ఉంది. ఇక ఆరు, ఏడు స్థానాల్లో గుజరాత్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. చివరి మూడు స్థానాల్లో ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ ఉన్నాయి. అత్యంత దారుణంగా ఆడిన ఏడు మ్యాచుల్లో ఒకటి మాత్రమే గెలిచిన ఆర్సీబీ అట్టడుగున కొనసాగుతోంది. ఈరోజు రాజస్థాన్, కేకేఆర్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. దీంతో పాయింట్ల టేబుల్ లో మళ్లీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 

Also Read: Rohit Sharma Oops Moment: ప్యాంట్ జారిపోతున్నా ఫీల్డింగ్ అద్భుతంగా చేసిన రోహిత్, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News