Manu bhaker Coach: మను బాకర్ కోచ్ కు బిగ్ షాక్... పారిస్ నుంచి హుటా హుటీన భారత్ కు.. అసలేం జరిగిందంటే..?
Samaresh Jung: మనుభాకర్ పేరు దేశమంతాట మార్మోగిపోతుంది. హ్యాట్రిక్ పతకం గెల్చుకునే దిశగా అడుగు దూరంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె కోచ్ కు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది.
manu bhaker coach samaresh jung receives house demolition notice from highcourt: ప్రస్తుతం పారిస్ లో విశ్వక్రీడలు నడుస్తున్నాయి. హ్యాట్రిక్ పతకం సాధించేక్రమంలో మను కేవలం ఒక్క అడుగు మాత్రమే వెనక ఉన్నారు. ఎక్కడ చూసిన మనూభాకర్ పేరు మార్మోగిపోతుంది.ఈ క్రమంలో ఆమె కోచ్ కు మాత్రం కలలో కూడా ఊహించని ట్విస్ట్ ఎదురైంది. దేశానికి మూడు ఒలింపిక్ మెడల్స్ రావడంలో షూటర్ల పాత్ర ఎంత ఉంటుందో.. వారిని ట్రైన్ చేసిన వారి కష్టం కూడా అంతే ఉంటుంది.
ఇదిలా ఉండగా.. మనూబాకర్ కోచ్..సమరేష్ గైక్వాడ్ ఢిల్లీ లో ఉంటున్న కూల్చివేస్తామంటూ కూడా హైకోర్టు నుంచి నోటీసులు అందాయి. అంతేకాకుండా..ఇది డిఫెన్స్ ప్రాంతానికి చెందిన స్థలమని, రెండు రోజుల్లో ఖాళీచేసి వెళ్లిపోవాలంటూ కూడా నోటీసులు అందాయి. దీంతో ఆయన ఒక్కసారగా షాక్ కు గురయ్యారు. పారిస్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఒలింపిక్స్ లో దేశం కోసం పతకాలు సాధించేలా చేస్తే..తనకు పూల మాలలతో స్వాగతం పలుకుతారంటే.. ఇలా నోటీసులతో వెల్ కమ్ చెప్పడమేంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సమరేష్ జంగ్ ఢిల్లీలో ఖైబర్ కాస్ లో ఉంటున్న ప్రదేశం డిఫెన్స్ వారిదని ఢిల్లీ హైకోర్టు ఇటీవల జులై 9 తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ల్యాండ్ అండ్ డెవలప్ మెంట్ వారు ఈ విధంగా రెండు రోజుల్లో ఖాళీ చేయాలని కూడా నోటీసులు జారీ చేశారు. 75 ఏళ్లుగా ఆ ఇంట్లో ఉంటున్నామని.. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి పోవాలని కూడా సమరేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆయన తన ఆవేదనను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దేశం కోసం పతకాలు తీసుకొచ్చేలా చేసిన వాళ్లపట్ల ఇదేనా.. గౌరవమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచింది. మరోవైపు మనూభాకర్ రేపు (జులై3) న 25 మీ. పిస్టల్ విభాగంలో మూడో పతకం గెల్చుకునే క్రమంలో కేవలం అడుగు దూరంలో ఉన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter