విరాట్ కోహ్లీకి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ క్లాస్ !!
ముంబై: ఇంగ్లండ్ తో తొలి టెస్ట్ మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు గుర్తుందా.. తాను ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సింది ఏదీ లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కోహ్లీ ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ.. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగాచ ఆయన సుతిమొత్తగా టీమిండియా కెప్టెన్ కు క్లాస్ పీకాడు.
సచిన్ ఏమన్నాడంటే ... డియర్ కోహ్లీ.. నా అనుభవం మేరకు ఒకటి చెబుతున్నా.. నువ్వు ఇంకా డన్నుల కోద్ది పరుగులు సాధించాల్సి ఉంది...ఇక్కడితో సంతృప్తి చెందకు...ఎప్పుడైతే నువ్వు సంతృప్తి చెందడం అలవాటు చేసుకుంటావో అప్పుడే నీ పతనం కూడా ప్రారంభమౌతుందని అని సచిన్ వార్నింగ్ ఇచ్చాడు.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోహ్లీని లక్ష్యంగా చేసుకుని పలువురు సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా స్పందించాడు. సచిన్ వ్యాఖ్యలు విమర్శలుగా భావించరాదని.. అవి ఓ సీనియర్ ఆటగాడిగా ఆయన ఇచ్చిన సలహాలు గానే భావించాలని క్రీడా విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు..కాగా ఈ వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది