Maxwell Join RCB: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ప్రవాస భారతీయురాలు, తమిళనాడుకు చెందిన వినీ రామన్ ను ఇటీవలే పెళ్లాడు. పెళ్లి తర్వాత పాకిస్థాన్ తో సిరీస్ తో పాటు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహించనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శిబిరంలో శుక్రవారం చేరాడు. మూడు రోజుల క్వారంటైన్ పూర్తైన తర్వాత ఏప్రిల్ 5న రాజస్థాన్ తో తలపడే మ్యాచ్ కు మ్యాక్ వెల్ ఆడే అవకాశం ఉంది. 


మూడు రోజుల క్వారంటైన్‌తోపాటు RT-PCR టెస్టులో నెగిటివ్‌ రావడం వల్ల మ్యాక్స్‌వెల్‌ బెంగళూరు (RCB) జట్టుతో కలిశాడు. రాజస్థాన్‌ రాయల్స్ తో జరగనున్న మ్యాచ్‌కు విదేశీ ఆటగాళ్లు విల్లే, రూథర్‌ఫోర్డ్‌లలో ఒకరిని తప్పించి మ్యాక్స్‌వెల్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ మెగా వేలానికి ముందు రూ. 12 కోట్లు వెచ్చించి.. మ్యాక్స్ వెల్ ను ఆర్సీబీ రిటెయిన్ చేసుకుంది.  


Also Read: LSG vs CSK: దంచికొట్టిన చెన్నై బ్యాటర్లు.. లక్నో ముందు భారీ టార్గెట్‌! మొదటి కీపర్‌గా ధోనీ అరుదైన రికార్డు!!


Also Read: IPL 2022 Spectators: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook