Rohit Sharma says Jasprit Bumrah bowling special but our batters disappointing: ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ మరో దారుణ ఓటమిని చవిచూసింది. వరుస పరాజయాల అనంతరం రెండు మ్యాచ్‌లల్లో గెలిచి.. గాడినపడిందనుకున్న సమయంలో మరో ఓటమిని ఎదుర్కొంది. సోమవారం రాత్రి డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్ చేతిలో ముంబై చిత్తుచిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 165 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ముంబై 113 పరుగులకే ఆలౌట్ అయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తమ బ్యాటింగ్ తీరు నిరాశకు గురి చేసిందన్నాడు. 'మా బౌలింగ్‌ విభాగం బాగా రాణించింది. బౌలర్లు అందరూ గొప్ప ప్రదర్శన చేశారు. జస్ప్రీత్ బుమ్రా అద్భుతం. గొప్పగా మెరిశాడు. అయితే మేం బ్యాటింగ్‌ చేసిన తీరుకు చాలా నిరాశ చెందా. ఒక్కరు కూడా మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఈ పిచ్‌పై బ్యాటింగ్‌ చేయడం అంత కష్టమేం కాదు. ఈ మైదానంలో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు ఆడాం కాబట్టి పిచ్ ఎలా స్పందిస్తుందో ఓ అవగాహన ఉంది. ఇలాంటి లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు మంచి భాగస్వామ్యాలు కావాలి. కానీ మాకు అది కుదరలేదు' అని రోహిత్ చెప్పాడు. 


'కోల్‌కతా నైట్‌ రైడర్స్ తొలి 10, 11 ఓవర్లలో 100 పరుగులు చేసింది. వారి బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే.. భారీ స్కోర్ చేస్తారనిపించింది. అయితే మా బౌలర్ల ప్రదర్శనతో మేం తిరిగి పుంజుకోవడం గొప్ప విషయం. జస్ప్రీత్ బుమ్రా ప్రత్యేకంగా నిలిచాడు. ఈ సీజన్‌లో మా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో నిలకడ లోపించింది' అని రోహిత్‌ శర్మ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. బుమ్రా ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి ఐదు వికెట్ల ఘనత ఇదే. 


కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మాట్లాడుతూ... 'గత మ్యాచ్‌లో భారీ తేడాతో ఓటమిపాలైన మేము ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవడం సంతోషంగా ఉంది. విజయాలు సాధిస్తే ఎంతో బాగుంటుంది. ఈ మ్యాచ్‌లో అందరూ అద్భుతంగా ఆడారు. పవర్‌ప్లేలో వెంకటేశ్‌ అయ్యర్‌ బాగా ఆడాడు. బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బంతులేసి ప్రత్యర్థి బ్యాటర్లకు షాట్లు ఆడే అవకాశం ఇవ్వలేదు. ఇది మంచి విజయమే అయినా నేను పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేను' అని పేర్కొన్నాడు. 


Also Read: India Covid 19 Cases: తగ్గిన కరోనా కొత్త కేసులు.. ఈరోజు ఎన్నంటే?


Also Read: Mohali RPG Attack: ఇంటెలిజెన్స్‌ హెడ్‌ క్వార్టర్స్‌పై రాకెట్‌ దాడి, ఉగ్రవాదుల పనే అని అనుమానం..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook