అబుధాబిలోని షేక్ జాయేద్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా గురువారం రాత్రి ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ( MI vs KXIP match ) టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ( KL Rahul ) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) (70; 45 బంతుల్లో 8x4, 3x6), కీరన్ పోలార్డ్ ( Kieron pollard ) (47; 20 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్ పాండ్య ( Hardik Pandya ) (30; 11 బంతుల్లో 3x4, 2x6) పరుగులతో రాణించారు. Also read : RR vs KKR, IPL 2020 : రాజస్తాన్‌ను రఫ్ఫాడించిన కోల్‌కతా నైట్ రైడర్స్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొల్లార్డ్, హార్ధిక్ పాండ్య ఇద్దరూ కలిసి ఫోర్లు, సిక్సుల వరద పారించి 23 బంతుల్లోనే 67 పరుగులు రాబట్టారు. క్రిష్ణప్ప గౌతం వేసిన మ్యాచ్ చివరి ఓవర్లో పొలార్డ్ చెలరేగిపోయాడు. ఈ ఓవర్లో బంతిని చెండాడుకున్న పొలార్డ్ ఏకంగా 25 పరుగులు సాధించాడు. అంతిమంగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగుల స్కోరు సాధించింది. Also read : RCB vs MI match highlights: భారీ సస్పెన్స్ మధ్య సూపర్ ఓవర్‌లో బెంగళూరు సూపర్ విక్టరీ


192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన Kings XI punjab ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించే పరిస్థితి కనిపించ లేదు. ముంబై ఇండియన్స్ బౌలర్ల ( Mumbai Indians bowlers ప్రతిభ ఓవైపు.. కట్టుదిట్టమైన ఫీల్డింగ్ మరోవైపు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు కష్టాలు తప్పలేదు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో నికోలస్ పూరన్ ( Nikolas Pooran ) (44), మయాంక్ అగర్వాల్ ( Mayank Agarwal ) (25), క్రిష్ణప్ప గౌతం ( Krishnappa Gowtham ) (22), కేఎల్ రాహుల్ ( KL Rahul ) (17) మినహా మిగతా వాళ్లెవ్వరూ ఆ మాత్రం కూడా రాణించలేదు. ఫలితంగా 48 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఘోర పరాజయంపాలైంది. Also read : KKR vs SRH match: మళ్లీ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe