RCB vs MI match highlights: భారీ సస్పెన్స్ మధ్య సూపర్ ఓవర్‌లో బెంగళూరు సూపర్ విక్టరీ

RCB beat MI in Super over: ఐపిఎల్ 2020లో ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌లు ఒకెత్తు.. సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bengalore ) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒకెత్తు. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతూ ఐపిఎల్ ప్రియులను తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన మ్యాచ్‌ ఇది. 

Last Updated : Sep 29, 2020, 01:18 AM IST
RCB vs MI match highlights: భారీ సస్పెన్స్ మధ్య సూపర్ ఓవర్‌లో బెంగళూరు సూపర్ విక్టరీ

RCB beat MI in Super over: ఐపిఎల్ 2020లో ఇప్పటివరకు జరిగిన 9 మ్యాచ్‌లు ఒకెత్తు.. సోమవారం రాత్రి ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒకెత్తు. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతూ ఐపిఎల్ ప్రియులను తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన ఈ మ్యాచ్‌లో ఆఖరికి సూపర్ ఓవర్‌లో విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును వరించింది.

టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టేన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగింది. విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సేన నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్స్ దేవదత్ పడిక్కల్ ( Devdutt Padikkal ) 54 (5 ఫోర్లు, 2 సిక్స్ లు), ఆరోన్ ఫించ్ 52 (7 ఫోర్లు, 1 సిక్స్) లతో ఇద్దరూ అర్థ శతకం పూర్తి చేసుకున్నారు. ఈ ఐపిఎల్‌లో దేవ‌దత్‌కి ఇది రెండో హాఫ్ సెంచరీ. వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 81 పరుగులతో జట్టుకు శుభారంభం అందించారు. చివర్లో ఏబీ డివిలియర్స్ 54 నాటౌట్ (24 బంతుల్లో; 4 ఫోర్లు, 4 సిక్స్ లు) రెచ్చిపోయాడు. శివం దూబే 27 నాటౌట్ ( 10 బంతుల్లో1 ఫోర్, 3 సిక్స్ లు) కూడా రాణించడంతో బెంగళూరు స్కోరు 200 దాటింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, రాహుల్ చహర్ ఓ వికెట్ తీసుకున్నారు. Also read : MI VS RCB match news updates: ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఎవరి బలం ఎంత ?

లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) జట్టుకి ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. రోహిత్ శర్మ ఎనిమిది బంతులు ఆడి 8 పరుగులే చేయగా క్వింటన్ డికాక్ 14 పరుగులతో సరిపెట్టుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ డకౌట్‌ అయ్యాడు. ఇలా ఆరంభంలోనే కష్టాల్లో పడిన జట్టును ఇషాన్ కిషన్ ( Ishan Kishan ), పొలార్డ్ ( Pollard ) జోడీ మ్యాచ్‌ గమనాన్ని మార్చేసింది. ఇషాన్‌ కిషన్‌ (99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), పొలార్డ్‌ (60 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)లతో చెలరేగిపోయి జట్టును విజయతీరాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆఖరి బంతికి 5 పరుగులు అవసరం ఉండగా.. పొలార్డ్ 4 కొట్టడంతో మ్యాచ్ టైగా ముగిసింది. Also read : Sourav Ganguly, Ind vs Eng: భారత్‌లోనే ఇండియా vs ఇంగ్లాండ్

రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ టై కావడంతో రెండు జట్లతో సూపర్‌ ఓవర్‌ ( Rcb vs MI Super over ) ఆడించారు. ఈ సూపర్ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌లు ఓపెనింగ్‌కు దిగగా.. ఒక వికెట్ కోల్పోయి 7 పరుగులే చేసింది. Also read : Amit Mishra: నాకు కావాల్సింది దొరకలేదు, అయినా ఆగిపోలేదు

ముంబై తరఫున జస్ప్రిత్ బుమ్రా సూపర్‌ ఓవర్‌ బౌలింగ్ చేయగా, ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలు ( AB De Villiers, Virat Kohli ) ఓపెనింగ్‌కు వచ్చారు. మొదటి రెండు బంతుల్లో ఒక్కో పరుగు, మూడో బంతి డాట్ బాల్ కాగా నాలుగో బంతిని ఏబీ డివిలియర్స్ ఫోర్ కొట్టాడు. ఐదో బంతికి సింగిల్ తీశారు. దీంతో సస్పెన్స్ మరింత రెట్టింపయ్యింది. మ్యాచ్ ఎవరి వశం అని అందరూ ఉత్కంఠగా చూస్తుండగా కోహ్లీ ఆఖరి బంతిని బౌండరీకి తరలించడంతో బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. ఈ ఐపిఎల్ సీజన్‌లో బెంగళూరు జట్టుకు ఇది రెండో విజయం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News