Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కు మరో భారీ షాక్.. రోహిత్ శర్మపై వేటు..?
MI Captain Rohit Sharma may get BAN in future in IPL 2022. ఐపీఎల్ 2022లో రోహిత్ శర్మ మూడోసారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే.. రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటాడు.
Rohit Sharma faces Ban if Mumbai Indians repeat slow over-rate again in IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. వరుస ఓటుములతో సతమతమవుతున్న ముంబైకి మరో భారీ షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా పడింది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 ఓవర్లను నిర్ణీత సమయంలో పూర్తి చేయనందుకు హిట్‌మ్యాన్‌పై ఏకంగా రూ. 24 లక్షల జరిమానా పడింది. ముంబై కెప్టెన్‌కి జరిమానా పడడం ఇది రెండోసారి.
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ జట్టు సభ్యలుకు కూడా రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ అధికారులు ప్రకటించారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కూడా ముంబై స్లో ఓవర్‌రేట్‌ను ఎదుర్కొంది. రోహిత్ మూడోసారి స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడితే.. రూ.30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటాడు.
'ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ రెండోసారి స్లో ఓవర్ రేటు తప్పిదానికి పాల్పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. కెప్టెన్ రోహిత్ శర్మకు రూ. 24 లక్షలు జరిమానా విదిస్తున్నాం. అలాగే టీమ్ సభ్యులకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం' అని ఐపీఎల్ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి చుస్తే.. రోహిత్ శర్మపై వేటు తప్పకపోవచ్చు. జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్, బాసిల్ తంపి, టైమల్ మిల్స్ రూపంలో నాలగురు పేసర్లు ఉండడమే స్లో ఓవర్ రేట్‌కు కారణమవుతోంది. మురుగన్ అశ్విన్ ఒక్కడే స్పిన్ బౌలర్.
ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. వరుస ఓటములతో ముంబై ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ సీజన్‌లో తొలి ఐదు మ్యాచ్‌ల్లో రెండుసార్లు ఓడిన తొలి జట్టుగా ముంబై రికార్డుల్లో నిలిచింది. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చెందడంతో ముంబై ఖాతాలో చెత్త రికార్డు నమోదైంది. అంతకుముందు 2014 సీజన్‌లోనూ తొలి ఐదు మ్యాచ్‌లను ముంబై ఓడిపోయింది.
Also Read: Krithi Shetty: చందమామలా మెరిసిపోతున్న కృతి శెట్టి.. బేబమ్మ అందాలకు కుర్రాళ్లు ఫిదా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook